English | Telugu

Eto Vellipoyindhi Manasu : మనసులో మాట చెప్పకుండా ఆగిపోయిన భర్త.. ఆమె అర్థం చేసుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -192 లో......రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ బయటకు వస్తాడు. తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. కానీ శ్రీవల్లి సందీప్ ని తీసుకొని కావాలనే వాళ్ళకి దగ్గరగా వస్తుంది. వాళ్ళని చూసి.. సీతాకాంత్ ప్రేమ విషయం చెప్పకుండా ఆగిపోతాడు. ఇంకెప్పుడైన నా మనసులో మాట చెప్తానని సీతాకాంత్ అంటాడు. పాపం తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడేమోనని రామలక్ష్మి అనుకుంటుంది.

మరొకవైపు వచ్చిన పని అయిపోయింది సీతా బావ చెప్పకుండా డిస్టబ్ చేశానని శ్రీవల్లి అనుకొని.. అప్పుడే సందీప్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటిరోజు నందిని సీతాకాంత్ కి ఇష్టమైన సూట్ ని తనకి పార్శిల్ చేస్తుంది. అందులో ఒక లెటర్ కూడా పెడుతుంది. అది ఒకతనికి ఇచ్చి ఈ అడ్రెస్ కి వెళ్లి సీతాకి మాత్రమే ఇవ్వమని చెప్తుంది. నా ప్రేమతో సీతాని దగ్గర చేసుకోవడం కష్టమేమి కాదని నందిని అనుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్ నిద్ర లేచి నందిని మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు ఏవండీ ఆఫీస్ కీ లేట్ అవుతుందని రామలక్ష్మి వస్తుంది. నాకు రావాలని లేదు.. ఫోటో షూట్ ఇష్టం లేదని చెప్పగానే.. ఎందుకు అలా అంటున్నారని రామలక్ష్మి అలుగుతుంది. దాంతో నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను.. వస్తానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ బయట ఫోన్ మాట్లాడుతాడు. పక్కనే రామలక్ష్మి పూజ చేస్తుంది. ఆప్పుడే పార్శెల్ తీసుకొని వచ్చి సీత అంటే అమ్మాయి అయి ఉంటుందని రామలక్ష్మికి ఇస్తాడు. అది చూసి తను ఏదైనా ఆర్డర్ పెట్టి ఉంటాడని రామలక్ష్మి అనుకుని హల్లో పెడుతుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి ఓపెన్ చేయబోతుంటే రామలక్ష్మి వచ్చి.‌. వేరొకరిది ఇలా ఓపెన్ చెయ్యడం కరెక్ట్ కాదని తెలియదా అని అంటుంది.

ఆ తర్వాత ఆ పార్శెల్ ని తీసుకొని గదిలోకి వెళ్లి సీతాకాంత్ కి ఇచ్చి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. అది సీతాకాంత్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో సూట్ ఉంటుంది అది చూసి రామలక్ష్మి తీసుకుంది ఇది. ఇప్పుడే వేసుకొని స్పెషల్ డే రోజు వేసుకుంటానని అక్కడ పెడతాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. ఆ సూట్ చూసి అయన ఆర్డర్ చేసుకున్నారా అని అనుకుంటుంది. అందులో లెటర్ కింద పడిపోతుంది. మరొకవైపు సీతాకాంత్ సూట్ కి సెట్ అయ్యేలా నందిని రెడీ అవుతుంది‌. నా సీతా సూట్ వేసుకొని వస్తాడంటూ హారికకి నందిని చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ రెడీ అయి వస్తాడు. ఏంటి ఆ సూట్ వేసుకోలేదని రామలక్ష్మి అడుగుతుంది. అది స్పెషల్ డే రోజు వేసుకుంటానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.