English | Telugu

కృష్ణ మూర్తికి ఇంటి పత్రాలు ఇచ్చిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -219 లో.. వినాయకుడి పూజలో భాగంగా సీతారామయ్య ఒక పోటీ పెడతాడు. ఈ పోటీలో గెలిచినవారు పూజ చెయ్యాలని సీతారామయ్య చెప్తూ.. భార్యభర్తలు ఇద్దరు జంటగా కలిసి బాణంతో సెంటర్ పాయింట్ ని కొట్టాలనేది రూల్ అని అందరికి వివరిస్తాడు. అలా పోటీలో భాగంగా మొదటగా స్వప్న, రాహుల్ వచ్చి ప్రయత్నించి ఓడిపోతారు.

ఆ తర్వాత కళ్యాణ్ అనామిక అనుకుంటారు కానీ కళ్యాణ్ ఆలోచించి.. అప్పు నువ్వు అయితే పర్ ఫెక్ట్ గా వెయ్యగలవని అప్పుని పిలుస్తాడు. ఆ తర్వాత అప్పు వచ్చి కళ్యాణ్ పక్కన నిలుచునేసరికి అనామిక జెలస్ గా ఫీల్ అయి.. నువ్వు వద్దు, నేను నేను అంటూ కళ్యాణ్ పక్కన నిల్చొని బాణం వేస్తుంది. వాళ్ళ గురి కూడా మిస్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ కావ్య లు చిలిపి తగాధాలతో బాణం గురిపెడతారు. వాళ్ళిద్దరు కరెక్ట్ గురి చుసి కొట్టడంతో పాయింట్ లో బాణం తగులుతుంది.

అలా ఈ పోటీలో రాజ్ కావ్య గెలిచి, వారి చేతుల మీదుగా వినాయకుడి పూజ జరిపించాలని అనుకుంటారు. పూజ మొదలవకముందే ఆ చీటీలో రాజ్ ఏం రాశాడో చూడాలని కావ్య అనుకుంటుంది. అందరికంటే ముందు కావ్య వెళ్లి.. ఆ గాజు హుండీలోని చీటీ తీసుకొని తన కొంగుకి ముడి వేసుకుంటుంది. మరొక వైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావ్? అనామిక వాళ్ళు మా ఇంటికి పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నారని చెప్పడానికి కాల్ చేశానని కళ్యాణ్ అంటాడు. అయితే నాకేంటి, నాతో నీకు అవసరం అయిపోయింది . ఇక మాటలు ఎందుకు అంటు కళ్యాణ్ పై అప్పు కోప్పడుతుంది. ఎందుకు అలా కోప్పడుతున్నావంటు కళ్యాణ్ అడుగుతాడు. అయిన అప్పు సమాధానం చెప్పదు.

మరొక వైపు రాజ్ కావ్య ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత కావ్య ఇంటి పత్రాలు తీసుకొని వచ్చి రాజ్ చేతుల మీదుగా కృష్ణ మూర్తికి ఇప్పిస్తుంది. కృష్ణమూర్తి చాలా సంతోషపడతాడు. నా కూతురుని ఎలా చూసుకుంటారో ఏమోనని భయం వేసింది. ఇప్పుడు తెలిసింది చాలా బాగా చూసుకుంటున్నారని రాజ్ తో కృష్ణమూర్తి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.