English | Telugu

జగతి దెయ్యమై దేవయాని మీద పగ తీర్చుకోనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -886 లో.. జగతికి చేయాల్సిన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత రిషి తన తండ్రిని ఒళ్ళో పడుకోబెట్టుకొని, తన తల్లి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే వసుధార వస్తుంది. మహేంద్ర సర్ పడుకున్నారని అనగానే.. ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు డాడ్, ఆయన దుఃఖాన్ని చూడలేక పోతున్నానని రిషి బాధపడతాడు.

కాసేపటికి ఇప్పుడు మీ అవసరం మహేంద్ర సర్ కీ చాలా ఉంది. మీరు సర్ ని బాగా చూసుకోండి. నాకు మా నాన్న తోడుగా ఉన్నాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే పిలవండని వసుధార చెప్పి వెళ్ళబోతుండగా, వసుధార చెయ్యి పట్టుకుంటాడు రిషి. నీ అవసరం ఇప్పుడే ఉంది వసుధార. చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలని ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కాసేపు ఇక్కడే ఉండు వసుధారా అని రిషి అంటాడు. మీరేం ఆలోచించకండి సర్ అని వసుధార అంటుంది. అసలు ఇదంతా ఎవరు చేసారో తెలుసుకోవాలని ఉందని రిషి అంటాడు. సరే సార్ ఆ విషయం తెలుసుకోవడంలో మీకు నేను సపోర్ట్ గా ఉంటాను కానీ ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకోండి అని రిషికి వసుధార సలహా ఇస్తుంది.

మరొక వైపు తన గదిలో ఉన్న దేవయాని.. జగతి ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావ్? కొంపతీసి బాధపడుతున్నావా అని అడుగుతాడు. అదేం లేదు.. కంగారుపడుతున్నానని దేవయాని అంటుంది. ఎందుకని శైలేంద్ర అడుగుతాడు. రిషికి మన గురించి తెలిసిపోతుందేమో అని దేవయాని అనగానే.. తెలిస్తే ఏంటి? తెలిస్తే వాన్ని కూడా చంపేస్తా అని శైలేంద్ర అంటాడు. కాసేపటికి జగతి ఫోటో దగ్గర ఉన్న దీపాలు ఆరిపోతాయ్. దాంతో దేవయాని ఒక్కసారిగా బయపడుతుంది.

ఏంటి మమ్మీ అని శైలేంద్ర అడుగుతాడు. కొంపదీసి జగతి దెయ్యం అయ్యి మనల్ని పగపడుతుందా? దీపాలు ఆరిపోయాయి. విండో కూడా ఓపెన్ లేదు, డోర్ క్లోజ్ ఉందని దేవయాని అనగానే.. అవన్నీ ఏం పట్టించుకోకని శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు మహేంద్ర దగ్గరకు రిషి టిఫిన్ తీసుకొని వచ్చి.. తినిపిస్తే వద్దని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత అందరు ఎవరికీ వారే జగతిని గుర్తుచేసుకుంటూ బాధపడతారు. దేవయాని, శైలేంద్ర ఇద్దరు మాత్రం హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.