English | Telugu

ముకుంద, మురారీల ప్రేమ విషయం ప్రభాకర్ కనిపెట్టగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -280 లో.. కృష్ణ మురారి ఇద్దరు బయటకి వెళ్తుంటే భవాని ఆపి.. మురారిని ఆదర్శ్ గురించి తెలుసుకోవడానికి పంపిస్తుంది. మురారి చేసేదేమీ లేక వెళ్తాడు. ఆ తర్వాత ఇదంతా ముకుంద ప్లాన్ అయి ఉంటుందా అని కృష్ణ అనుకుంటుంది.

మరొక వైపు మురారి వెళ్తు వెళ్తు.. పాపం కృష్ణ డిస్సపాయింట్ అయింది కావచ్చు అనుకుంటు వస్తుంటే అప్పుడే ఎదురుగా ముకుంద వచ్చి.. మురారి బైక్ ని ఆపుతుంది. నేను వస్తానని ముకుంద అడుగుతుంది. దానికి వద్దని మురారి అంటాడు. అప్పుడు భవానికి ముకుంద ఫోన్ చేస్తుంది. నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదని భవానితో ముకుంద అనగా.. తనని తీసుకొని వెళ్ళమని భవానీ చెప్పగానే ముకుందని మురారి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ప్రభాకర్ , శకుంతల కలిసి కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. ఉన్నన్ని రోజులు కృష్ణ కష్టసుఖలు తెలుసుకోవాలని అనుకుంటారు. అప్పుడే కృష్ణ వస్తుంది. చిన్నాన.. నువ్వు భవాని అత్తయ్యతో గణేషుడిని నీ తీసుకొని వస్తానని అన్నావట కదా అని అడుగుతుంది. అప్పుడు ప్రభాకర్..

నేను ఎప్పుడు అన్నానంటు అంటాడు. ఆ తర్వాత తీసుకొని వస్తానని చెప్తాడు. మరొకవైపు మురారి, ముకుంద ఇద్దరు ఆదర్శ్ గురించి తెలుసుకోవడానికి ఒక అతని దగ్గరికి వెళ్తారు. అతను ఆదర్శ్ రావడానికి ఇష్టపడడం లేదు. ఎవరితోని మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మీరు ఆదర్శ్ పై హోప్ పెట్టుకోకండని అతను చెప్తాడు. సరే మేం వెళతామని మురారి, ముకుంద ఇద్దరు బయలుదేర్తారు. మురారి బయటకు వస్తాడు. థాంక్స్ నా ప్రేమని అర్థం చేసుకుని అబద్ధం చెప్పినందుకని అతనికి ముకుంద చెప్తుంది.

మరొకవైపు ముకుంద ఎక్కడ కన్పించడం లేదని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి భవాని వస్తుంది. మా చిన్నానని మీరు గణేషుడిని తీసుకొని రమ్మని చెప్పారా అని అడుగుతుంది. అవునని చెప్పి.. నేను రేపు ఊరు వెళ్తున్నాను. మూడు రోజుల్లో వస్తానని కృష్ణకి భవాని చెప్తుంది. మరొక వైపు ముకుంద, మురారి ఇద్దరు కాఫీ షాప్ కి వెళ్తారు. వాళ్లని ప్రభాకర్ చూస్తాడు. మరొక వైపు ఇంట్లో ఉన్న శకుంతల.. ఇంట్లో వాళ్లని పరిచయం చేసుకునే బిజీలో ఉంటుంది. కృష్ణ, రేవతి కలిసి ముకుంద ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని అడుగుతారు. నాకేం తెలియదని అలేఖ్య చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.