English | Telugu
మన ప్లాన్స్ వాళ్లకు తెలియవు..పాపం పసివాళ్లు...ఇక అంతా ఉల్టాఫుల్ట
Updated : Aug 1, 2023
బిగ్ బాస్ న్యూ సీజన్ రాబోతున్న నేపథ్యంలో రోజుకో, రెండు రోజులకో ఒక్కో కొత్త ప్రోమోని వదులుతున్నారు మేకర్స్. ఆ ప్రోమోస్ తో ఆడియన్స్ లో ఇంకా హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ నాగార్జున కుడి ఎడమైతే అంటూ ఒక కంఫ్యూజన్ ని ఆడియన్స్ లో క్రియేట్ చేశారు. హౌస్ లోకి వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారంటూ కూడా రకరకాల వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి బిగ్ బాస్ న్యూ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షోకి సీజన్ 1 నుంచి మంచి ఆదరణ ఉంది. కాకపోతే రీసెంట్ గా ముగిసిన సీజన్స్ కి మాత్రం కొంచెం రేటింగ్ తగ్గిందేమో కానీ ఓవరాల్ గా షో మాత్రం ఆడియన్స్ కి బాగానే రీచ్ అయ్యింది. ఈ కార్యక్రమం అన్ని భాషల్లో కూడా మంచి పాపులారిటీనీ సంపాదించుకుంది.
రీసెంట్ ప్రోమోలో నాగార్జున లుక్ మెస్మోరైజింగ్ గా ఉంది. ఇందులో భాగంగా నాగార్జున మాటలను వింటే ఈసారి బిగ్ బాస్ కార్యక్రమం అందరూ ఊహించిన విధంగా ఉండదని తెలుస్తోంది. కొత్త కొత్త చాలెంజెస్ తో కొత్త కొత్త రూల్స్ తో రాబోతుందని చెప్పారు.." ఆరు సీజన్లను చూసేసాం.. అంతా మాకు తెలుసు అని అనుకుంటున్నారు కంటెస్టెంట్స్ పాపం పసివాళ్ళు.. మన ప్లాన్స్ వాళ్లకు తెలియవు కదా.." అంటూ చిటికె వేసేసరికి ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. "ఈసారి బిగ్ బాస్ 7ఉల్టా ఫుల్ట" అంటూ నాగార్జున ఈ కొత్త బిగ్ బాస్ గురించి చెప్పేసరికి రాబోయే సీజన్ మొత్తాన్ని కూడా టోటల్ గా చేంజ్ చేసేశారనే విషయం తెలుస్తోంది. ఇప్పటి వరకు అన్ని సీజన్స్ లో అవే గేమ్స్ ...అవే డ్రామాస్ ..అవే కన్నీళ్లు..అవే గొడవలు. దాంతో ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేసింది. ఇక వాళ్ళను ఆ బోర్ నుంచి బయట పడేయడం కోసం అంత కొత్తగా రాబోతోంది బిగ్ బాస్. ఇకపోతే కంటెస్టెంట్స్ ని కూడా చూసి తీసుకొస్తే రాబోయే సీజన్ సూపర్ గా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా సప్పగా చేస్తూ గేమ్స్ ఆడకుండా..ఏడుస్తూ..సింపతీ కార్డు యూజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ సీజన్ కూడా లాస్ట్ సీజన్ లానే ఉంటుంది;. ఇక నీతోనే డాన్స్ షో ఐపోయిన వెంటనే బిగ్ బాస్ ని పట్టాలెక్కించబోతున్నారు. దాని కోసం కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు.