English | Telugu
రష్మీకి పెళ్లిచూపులు..నచ్చలేదని అబ్బాయికి చెప్పిన రాంప్రసాద్
Updated : Aug 1, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ రాబోయే ఆదివారం ప్రోమో చూస్తే చాలు అంతా ఫ్రెండ్ షిప్ థీమ్ తో కనిపిస్తుంది. ఇక ఈ ఆదివారం 6 వ తేదీ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం ఈ అంశంతో రూపొందించారు మేకర్స్. ఇక ఇందులో రాంప్రసాద్ పంచెస్ మాములుగా లేవు. ఈ షోకి నటుడు రవికృష్ణ, అంబటి అర్జున్ వచ్చారు. అర్జున్, రవికృష్ణ గొడవ పడుతూ స్టేజి మీదకు వచ్చేసరికి రాంప్రసాద్ "అసలు గొడవేమిటో చెప్పడం లేదు" అని ఆ గొడవేంటో తెలుసుకోవడానికి ట్రై చేసాడు. "వాడు ఫ్రెండ్ షిప్ కొద్ది ఒక అమ్మాయిని చూస్తే నేను వెళ్లి ముద్దు పెట్టాను" అని సీరియస్ గా చెప్పాడు రవికృష్ణ.."నేను లవ్ చేసిన అమ్మాయిని వాడు వెళ్లి ముద్దు పెట్టడమేమిటి" అని అంబటి అర్జున్ ఫైర్ అయ్యాడు. ఇదంతా ఓకే కానీ "ఇంతకు అమ్మాయి పేరేమిట్రా" అంటూ ఇద్దరినీ అడిగాడు.
కానీ వాడిని అడుగు అంటే వాడిని అడుగు అంటూ ఇద్దరూ అసలు పేరు చెప్పకుండా ఆ విషయాన్నీ దాటేసారు. తర్వాత కమెడియన్ బాబు, లేడీ కమెడియన్ శ్రీవిద్యతో కలిసి "పొట్టి పిల్ల" సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక ఈ షోకి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు రాంప్రసాద్.."రష్మీకి పెళ్లి చూపులనుకోండి..రష్మీ పెళ్లి చూపులకు వచ్చింది..నచ్చలేదని చెప్పేయండి" అని రాంప్రసాద్ అతనికి కోరస్ అందించేసరికి రష్మీ షాకైపోయింది. "చెప్పండి నేను నచ్చలేదా మీకు" అని రష్మీ అనేసరికి "ఆలోచిస్తాను" అని అతను చెప్పాడు. దానికి వర్ష సుధీర్ కి ఫోన్ చేసి "బావ నువ్వే ఆలోచించలేదు..అందరూ ఆలోచిస్తున్నారు" అని చెప్పింది. తర్వాత అర్జున్ , రవికృష్ణ ఇద్దరూ కలిసి ఫ్రెండ్ షిప్ కాన్సెప్ట్ మీద స్కిట్ వేశారు. వీళ్లకు తల్లిగా ప్రీతి నిగమ్ చేశారు. ఈ స్కిట్ చాలా ఎమోషనల్ గా ఉండడంతో స్టేజి మీద ఉన్నవాళ్ళంతా కంటతడి పెట్టారు..