English | Telugu

ఆ ఫోటో పట్టుకొని ఏడ్చేసిన పవన్ కళ్యాణ్!

ఇది అసలు ఎవరూ ఊహించి ఉండరు.. కళ్యాణ్ లో ఈ యాంగిల్ ఉంటుందా అని ఎవరూ అనుకోరు.. చూడటానికి నిబ్బాలా ఉండే పవన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్-9 లో సూపర్ గేమ్ ఆడుతున్నాడు. ‌

బిగ్ బాస్ సీజన్-9 లోకి సెలెబ్రిటీ కోటాలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పడాల ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.‌ చాలామంది ఇతనే సీజన్-9 విన్నర్ అని కూడా అనుకుంటున్నారు. ఇక తనూజ మీద పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రష్ చూసి అందరు వీరి మధ్య ప్రేమ ఉందేమోనని అనుకున్నారు కానీ కళ్యాణ్ చిన్నపిల్లాడు అని తనూజ సింపుల్ గా తీసేసింది. అయితే పదోవారం హౌస్ లో తనూజ క్వీన్ అయింది. ఆ తర్వాత హౌస్ లో రీతూ క్వీన్ ,నిఖిల్ కింగ్, తనూజ క్వీన్ గా ఉండగా బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు.. అందులో తనూజ గెలిచి పదో వారం ఇంటి కెప్టెన్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్స్ యొక్క చిన్నప్పటి ఫోటోలని పంపించాడు బిగ్ బాస్.

కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో చూడగానే మొదటగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత తన గతం చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. మా డాడీతో తిరిగింది గుర్తులేదు.. మా మమ్మీతో తిరిగింది గుర్తు లేదు.. చిన్నప్పుడు చాలా ఇబ్బందులు చూశాను.. అంటే చిన్నప్పుడు కదా తెలిసేది కాదు.. మీరు కావాలి డాడీ.. మీతో ఉండాలి అని చెప్పలేకపోయాను ఒక్కసారి కూడా.. ఇప్పటికీ నేను వాళ్లకి ఏం చెప్పలేను.. హాస్టల్‌లో జాయిన్ చేస్తానంటే సరే రండి అని వెళ్లి జాయిన్ అయిపోయాను. ప్రతి ఒక్కరూ హాస్టల్‌కి ఫోన్ చేసేవాళ్లు కానీ నా పేరెంట్స్ నుంచి మాత్రం కొన్ని నెలల వరకూ కాల్ వచ్చేది కాదు.. ప్రతి ఆదివారం నేను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చునేవాడ్ని ఫోన్ వస్తుందేమోనని.. కానీ రాలేదంటూ తమ తల్లిదండ్రులని గుర్తుచేసుకొని కళ్యాణ్ ఏడుస్తుంటే అందరు ఎమోషనల్ అయ్యారు. భరణి, ఇమ్మాన్యుయల్, సంజన వచ్చి పవన్ కళ్యాణ్ ని ఓదార్చారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...