English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్..కారణం ఇదే !


బిగ్ బాస్ సీజన్-7 లో ఎన్నో ట్విస్ట్ లు మరెన్నో టాస్ లతో పదిహేను వారాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం పదిహేను వారాలుగా సాగిన ఈ షోలో 19మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి ప్రతీవారం ఒక్కరు చొప్పున ఎలిమినేషన్ అవ్వగా చివరి వారంలో టాప్-6 ని ఉంచారు బిగ్ బాస్.

ఇక టాప్-6 లో మొదటగా ఓటింగ్ లో ఆరవ స్థానంలో ఉన్న అంబటి అర్జున్ ఎలిమినేషన్ అవ్వగా, ఆ తర్వాత అయుదవ స్థానంలో ఉన్న ప్రియాంక ఎలిమినేట్ అయింది. ఇక నాల్గవ స్థానంలో ఉన్న యావర్ కి 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ ఇవ్వగా దానిని తీసుకొని ‌హౌస్ నుండి బయటకొచ్చాడు యావర్. ఇక మూడవ స్థానంలో శివాజీ హౌస్ నుండి బయటకొచ్చారు. ఇక హౌస్ లో చివరగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఉండగా హోస్ట్ నాగార్జునే స్వయంగా వచ్చి వీరిద్దరిని బయటకు తీసకొచ్చారు. ఇక స్టేజ్ మీద ఇద్దరిని చూసిన కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకు ఎవరు విన్నర్ అవుతారనే టెన్షన్ మొదలవ్వగా.. సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాగార్జున అన్నాడు. అది వినగానే పల్లవి ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాగార్జున కి లవ్ యూ చెప్తూ తనకి ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు పల్లవి ప్రశాంత్.

తెలుగులోనే కాకుండా.. దేశ చరిత్రలో కామన్ మ్యాన్‌ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ప్రతీ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడి గెలిచాడు. తను సొంతంగా ఆడిన ఆటలో ఓటమి అంటూ లేదంటూ నిరూపించాడు పల్లవి ప్రశాంత్. హౌస్ మేట్సే కాదు హోస్ట్ నాగార్జున సైతం పల్లవి ప్రశాంత్ టాస్క్ లో ఆడిన ఆటతీరుకి ఫిధా అయ్యాడు. బయట సీజన్-7 మొదలైనప్పుడు తనని ట్రోల్స్ చేసిన ప్రతీ ఒక్కరి మాటలని రాళ్ళుగా మలుచుకొని ఒక్కో మెట్టుగా చేసుకున్నాడు ఈ రైతుబిడ్డ. కష్టపడి గెలవాలన్న కసితో ఆడితే ఏదైనా సాధించవచ్చని ఈ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. ఇక విజేగా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించాక తనకు వచ్చిన ప్రతీ రూపాయిని అప్పుల్లో, ఇబ్బందుల్లో ఉన్న రైతులకే ఉపయోగిస్తానని పల్లవి ప్రశాంత్ స్టేజ్ మీద చెప్పాడు. యూట్యూబ్ రివ్యూవర్స్, ఇన్ స్టాగ్రామ్ పేజీలలో ఎక్కడ చూసిన రైతుబిడ్డ ‌గెలుపు సరైనది అంటూ చెప్తుండగా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్.