English | Telugu
ట్రెండింగ్ లో ఉదయభాను చేసిన గోంగూర పప్పు వ్లాగ్ .. అసలేం ఉందంటే!
Updated : Dec 17, 2023
ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది.
ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేసిన ఉదయభాను.. కొన్నిరోజుల క్రితంన గోంగూర పప్ప ఎలా చేయాలో అనే ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది ఉదయభాను. ఇక ఇందులో గోంగూర పప్పు ఎక్కువగా తినకూడదని డాక్టర్స్ చెబుతారు ఎందుకంటే ఇది తింటే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయని చాలామంది చెబుతుంటారు.
ఒకప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయిన ఉదయభాను ఉండాల్సిందే. ఏ షో అయిన తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో " మా పిల్లల కోసం నేను చేసే గోంగూర పప్పు" అంటు ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందుల.. " పాలకూర తింటే రాళ్ళు వస్తాయని చాలామంది చెప్తారు కానీ రాదు. పాలకూర భుమికి చాలా దగ్గరగా పెరుగుతుంది. అందువలన దానికి మట్టి, ఇసుక ఎక్కువగా ఉంటుంది.
చాలాసార్లు కడిగితే కానీ ఆ ఇసుక పోదు. దానిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కిడ్నిల్లో రాళ్ళు వస్తాయి కానీ పాలకూర తింటే ఏమీ రావు " అని ఉదయభాను ఈ వ్లాగ్ లో చెప్పింది. అయితే 21 నిమిషాల నిడివి ఉన్న ఈ వ్లాగ్ లో.. ఒక నిమిషం కూడా లేని ఈ మాటలని కొందరు నెటిజన్స్ కట్ చేసి తనని నెగెటివ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా అనవసరమైన వాటిని కలిపి నెగెటివిటి తేవాలని చూస్తున్నారని కావాలని చేసినట్టుగా తెలుస్తోంది . అయితే ఇందులో ఉదయభాను తప్పుగా ఏం మాట్లాడలేదని యూట్యూబ్ లోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ చూస్తే తెలిసిపోతుంది. మరి ఇలాంటి వాటిని ఉదయభాను చూసిందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్లాగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.