English | Telugu

ఓటింగ్ లో శివాజీ నెంబర్ వన్..  రెండో స్థానంలో ప్రశాంత్ !



బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ డ్రామా నడుస్తుంది. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల‌ మధ్య నామినేషన్ లో జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో శోభాశెట్టి సిల్లీ నామినేషన్ చూసి జనాలంతా తిడుతున్నారు.

అర్జున్ కన్నింగ్ గేమ్ వల్ల గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు. గత ఆరు వారాల నుండి ప్రేక్షకులు శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేయకుండా ఉంటే బిగ్ బాస్ మామ.. దత్తపుత్రికని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ శోభాశెట్టి కోసం బిగ్ బాస్ చేస్తున్న హైటెన్షన్ డ్రామా చూసిన జనాలు.. ఏందిరా సామి ఈ రచ్చ.. ఏ కుళ్లు, కుతంత్రాలు తెలియని యావర్ ని టార్గెట్ చేస్తారా ఏంటని అనుకుంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ లో యావర్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నాడు. ప్రియాంక, శోభాశెట్టి అట్టడుగున ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. అయితే వారిద్దరి పైన అర్జున్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కి పడే ఓట్లని చూస్తుంటే అవన్నీ పీఆర్ ఓట్లలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అమర్ దీప్ ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడింది లేదు. అయినా ఓట్లు పడుతున్నాయంటే అవి పీఆర్ స్టంట్సే అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ మామ ఈసారి అయిన ప్రేక్షకులు ఓసే ఓటింగ్ కి ప్రాముఖ్యత ఇచ్చి ప్రియంక, శోభాశెట్టిలలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా లేక వారిద్దరి కోసం యావర్ ని బలి చేస్తాడా చూడాలి.

ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో.. వంద శాతం ఓటింగ్ పడితే అందులో 60 శాతం ఓటింగ్ శివాజికి పడుతుంది. ఆ తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ కి 40 శాతం ఓటింగ్ పడుతుండగా.. మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్ కి 18 శాతం ఓటింగ్ పడుతుంది. ఇక ఆ తర్వాత 15 శాతం ఓటింగ్ తో యావర్ ఉన్నాడు. ఇక ప్రియాంక, శోభాశెట్టి లకి 5 నుండి 7 శాతం వరకు ఓటింగ్ పడుతుంది. అయితే బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ తో ఎవరైతే టాప్ లో ఉంటారో వారే విజేత. ఈ విషయాన్ని నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు. ఇదే జరిగితే నెంబర్ వన్ గా ఉన్న శివాజీనే విజేత వస్తుంది. రన్నరప్ గా ప్రశాంత్ కి వస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ వారంలో ఎవరు బయటకు వస్తారో చూడాలి మరి.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.