English | Telugu

ప్రియాంక జైన్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాక్ లో హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే ఉల్టా పుల్టా ట్విస్ట్ లతో ప్రేక్షకులకు కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి, వీకెండ్ లో శోభాశెట్టిని ఎలిమినేషన్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో‌ భాగంగా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న ప్రియంకని బయటకు పంపిస్తారనే వార్త తెగ వైరల్ అవుతుంది.

యావర్, ప్రశాంత్, శివాజీ.. ఈ ముగ్గురిలోనే ఒకరు విన్నర్ అవుతారనేది అందరికి తెలిసిన విషయం. అయితే ఆ ఒక్కరూ ఎవరనేది చివరి వరకూ సస్పెన్సే. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం.. శివాజీ, ప్రశాంత్‌ లకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అఫీషియల్ ఓట్లలో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉంటు దుమ్మురేపుతున్నాడు. టైటిల్ విన్నర్ శివాజీ అంటూ ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్‌ శోభాని సపోర్ట్ చేస్తూ.. ఇతర కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేయడంతో, ఈ సారి ఎవర్ని సపోర్ట్ చేస్తారో తెలియదు. తన దత్తపుత్రిక శోభాశెట్టి కోసం ఎవర్ని బలి చేస్తారనేది మాత్రం అంచనా వేయలేం.

కాబట్టి.. ఈవారం ఓటింగ్‌లో అమర్, ప్రశాంత్, శివాజీలకు టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ ముగ్గురికీ పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి. అయితే ప్రియాంక, శోభాశెట్టిలు రేస్‌లో ఉన్నా.. వాళ్లకి విన్నర్ అయ్యే అవకాశం లేకపోవడంతో.. వాళ్లకి ఓట్లు వేసి తమ ఓటుని వేస్ట్ చేసుకోకుండా యావర్ కి ఓట్లు వేస్తున్నారు. చాలామంది సీరియల్ ఫ్యాన్స్ అంబటి అర్జున్ కి ఓటేస్తున్నారు. అయితే అమర్ దీప్ ఓటింగ్ శాతం రోజు రోజుకి పడిపోతుంది. నిన్న నాల్గవ స్థానంలో ఉన్న అమర్ ఈరోజు అయిదవ స్థానంలో ఉన్నాడు. ఇక ఓటర్ల మైండ్ సెట్‌ని మార్చడంలో భాగంగా అమర్ దీప్ సెట్ చేసుకున్న పీఆర్ టీమ్ లు అతనే టాప్-3 అనే అపోహని ప్రేక్షకుల మీద రుద్దడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఈ వీకెండ్ శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి, మిడ్ వీక్ లో ప్రియాంకని ఎలిమినేషన్ చేస్తారనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అతి తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉన్న ప్రియాంక, శోభాశెట్టిలని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడా లేదా తెలియాలంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.