English | Telugu

12న బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్ హంగామా

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఏ స్థాయిలో పాపుల‌ర్ గా మారిందో అంద‌రికి తెలిసిందే. బిగ్గెస్ట్ క్రేజీ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఇప్ప‌టికీ సెల‌బ్రిటీలు, టీవీ స్టార్ లు, యూట్యూబ‌ర్స్, సామాన్యులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌లే ఓటీటీ మొట్ట మొద‌టి వెర్ష‌న్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజ‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. తొలి సారి మ‌హిళా కంటెస్టెంట్ బిందు మాధ‌వి టైటిల్ విన్న‌ర్ గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో నిర్వాహ‌కులు సీజ‌న్ 6 కు సంబంధించిన స‌న్నాహాలు మొద‌లు పెట్టేశారు.

దీనికి సంబంధించిన ప్రోమోని కూడా తాజాగా హోస్ట్‌ నాగార్జున పై చిత్రీక‌రించి రిలీజ్ చేశారు. సీజ‌న్ 6 లో అనూహ్యంగా సామాన్యుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. దీంతో చాలా మంది ఈ షోలోకి ప్ర‌వేశించే గోల్డెన్ ఛాన్స్ కోసం ఆస‌క్తిని చూపిస్తూ త‌మ‌లోని టాలెంట్ ని ప్ర‌ద‌ర్శించ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఇదిలా వుంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్స్ కు చెందిన 16 న‌టీన‌టుల్ని టీమ్ లుగా మార్చి బిగ్ బాస్ హౌస్ లో 24 గంట‌ల పాటు ర‌చ్చ‌కు ప్లాన్ చేసింది స్టార్ మా.

`బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్‌` పేరుతో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసింది. ఇప్ప‌టికే స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్స్ లోని న‌టీన‌టుల్ని ఈ కార్య‌క్ర‌మం కోసం ఎంపిక చేసి ఒక్క రోజులో వీరంతా చేసిన హంగామాని చూపించ‌బోతోంది. దీనికి యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ని ఈ ఆదివారం జూన్ 12న మ‌ధ్యాహ్నం 3:00 గంట‌ల‌కు ప్ర‌సారం చేయ‌బోతోంది. ఈ షోలో స్టేజ్ పై యాంక‌ర్ ర‌ష్మీ, శేఖ‌ర్ మాస్ట‌ర్ చేయ‌బోతున్న హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా వీరికి సంబంధించిన ప్రోమోని కూడా విడుద‌ల చేశారు. `మందులోడా ఓరి మాయ‌లోడా` అంటూ ర‌ష్మీ ఓ రేంజ్ లో స్టేజ్ ని అద‌ర‌గొట్టేసింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ `మమ్మ మ్మా మ‌మ్మా మ‌హేష్ ... ` అనే పాట‌కు డ్యాన్స్ ఫ్లోర్ ని ఇర‌గ‌దీసేశాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.