English | Telugu

Bigg Boss 9 Telugu Winner: విన్నర్ రేస్ లో కామనర్.. తనూజ వర్సెస్‌ కళ్యాణ్!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడో వారం ముగిసింది. ఇక ఈ సీజన్ చివరి దశకు రానే వచ్చింది. డిసెంబర్ 21 న గ్రాంఢ్ ఫినాలే అని అందరికి తెలిసిందే. ఇప్పటికే విన్నర్ రేస్ లో ఇద్దరున్నారు. సెలెబ్రిటీ కోటాలో వచ్చిన తనూజ పుట్టస్వామి, కామనర్స్ గా వచ్చిన కళ్యాణ్. వీళ్ళిద్దరే టాప్-2 పొజిషన్ లో ఉన్నారు. లాస్ట్ వీక్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి నామినేషన్ లో లేడు.. ఇక ఈ వీక్ టికెట్ టూ ఫినాలే విన్నర్ అయ్యాడు కాబట్టి ఈ వెక్ నామినేషన్ లో లేడు.. ఇది ఒకరకంగా అతనికి డిజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.

టూ వీక్స్ నామినేషన్ లో లేకుండా డైరెక్ట్ ఫినాలే వీక్ లో విన్నర్ రేస్ లో పోటీపడుతున్నాడు కళ్యాణ్. తనూజ విన్ అయినా అది హిస్టరీ క్రియేట్ చేసినట్లే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక్క లేడీ బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు. శ్రీముఖి విన్నర్ అవుతుందనుకున్నారు కానీ రన్నర్ గానే మిగిలిపోయింది. ఈసారి తనూజ విన్ అయితే మొదటి లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతుంది. ఇక కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ అయితే అది కూడా హిస్టరీ. ఇంతవరకు కామనర్స్ ఒక్కరు కూడా బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు. సీజన్- 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కానీ అతను కామనర్స్ కాదు.. ఎందుకంటే ఇన్ స్టాగ్రామ్ లో అప్పటికే చాలా ఫాలోవర్స్ ఉంది తన వీడియోస్ వైరల్ అవ్వడం వల్లనే హౌస్ లోకి ఎంట్రీ వచ్చింది.

కళ్యాణ్ విన్నర్ అయితే మాత్రం ఒక రియల్ కామనర్ విన్నర్ అయినట్లు.. అగ్నిపరీక్షకి ముందు కనీసం కొంతమంది కూడా ఫాలోవర్స్ లేరు.. ఫ్యామిలీ మిడిల్ క్లాస్.... ఇప్పుడు విన్నర్ రేస్ మొత్తం కామనర్, సెలబ్రిటీ మధ్యలో జరుగుతుంది. ఇద్దరిలో ఒకరు విన్నర్.. ఒకరు రన్నర్ మాత్రం ఖాయం. ఇక టాప్-3 అంటే ఇమ్మాన్యుయేల్, టాప్-4 పవన్, టాప్-5 భరణి. ఒకవేళ ఇమ్మాన్యుయేల్ విన్నర్ అయినా అది కూడా హిస్టరీ క్రియేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కామెడియన్ విన్నర్ ఇప్పటివరకు అవ్వలేదు. విజేత ఎవరో తెలియాలంటే మరో రెండు వారాల్లో తెలుస్తుంది.