English | Telugu

రవితేజ, సిద్దార్థ్ లతో గ్రాంఢ్ లాంచ్ 2.0 ప్రోమో అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే ఐదు వారాలు పూర్తయింది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు ఐదవ వారం ఎవరు ఎలినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. అయితే ప్రతీ శనివారం నాగార్జున కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవ్వడం, సండే ఫండే అంటూ సాగుతుందనే విషయం తెలిసిందే.

నిన్న జరిగిన శనివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్లో ఉన్న బాటమ్-3 ఎవరని నాగార్జున అడిగాడు. అందులో మెజారిటీ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, శుభశ్రీ, ప్రియాంక జైన్ అన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సండే ప్రోమోలో కొన్ని క్లూస్ ని ఇచ్చాడు నాగార్జున. ఈ రోజు గ్రాంఢ్ లాంచ్ 2.0 ఉంటుంది. దానికి గెస్ట్ లుగా మాస్ మహారాజ రవితేజ, బొమ్మరిల్లు సిద్దార్థ్ వస్తున్నారు.

అయితే గ్రాంఢ్ లాంచ్ లో ఇప్పటికే ఏడుగురు కన్ఫమ్ అవ్వగా.. చివరి నిమిషంలో కెవ్వు కార్తిక్ , అంజలి పవన్ డ్రాప్ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సాయంత్రం7 గంటలకు మొదలయ్యే గ్రాంఢ్ లాంచ్ వరకు ఆగాల్సిందే. కాగా రవితేజని హౌజ్ లోకి పంపించి కంటెస్టెంట్స్ చేత ఒక టాస్క్ చేపించినట్టుగా ప్రోమోలో నాగార్జున చెప్పాడు. కాగా బొమ్మరిల్లు సిద్దార్థ్ తో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదని అనగా.. క్రేజీ అని ప్రియాంక జైన్ అంది. మాస్ మహారాజా హౌజ్ లోకి వెళ్ళి ఎవరిని స్టేజ్ మీదకి తీసుకొస్తాడో తెలియాల్సి ఉంది.