English | Telugu
Guppedantha Manasu:తన భర్త కోసం భార్య ఆ అడ్రస్ కి వెళ్తుందా..!
Updated : Dec 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -951 లో... వసుధార క్యాబిన్ లోకి శైలేంద్ర వెళ్లి ఎండీ చైర్ లో కూర్చోవాలని అనుకుంటాడు. అప్పుడే వచ్చిన వసుధార... ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చారని కోప్పడుతూ ఫ్యూన్ ని పిలుస్తుంది. వీళ్ళని మెడపట్టుకొని బయటకు గెంటెయ్యమని ఫ్యూన్ తో వసుధార చెప్తుంది. దాంతో దేవయాని , శైలేంద్ర ఇద్దరు వెళ్లిపోతుంటారు. ఇంకొకసారి పర్మిషన్ లేకుండా లోపలికి రాకండి అని వాళ్ళకి వసుధార వార్నింగ్ ఇస్తుంది. అడ్డమైన వైరస్ లు అన్ని చైర్ కి తాకాయి. చైర్ ని క్లీన్ చెయ్యమని అక్కడే ఉన్న ఫ్యూన్ కి వసుధార చెప్తుంది. వసుధార మాటలు విని మరింత కోపంగా దేవయాని, శైలేంద్ర ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. ఎప్పుడు ఇక్కడే జగతి , నేను కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడు జగతి స్టూడెంట్స్ గురించి ఆలోచించేదని మహేంద్ర అంటాడు. అ తర్వాత పాపం వసుధార.. రిషి గురించి చాలా బాధపడుతుందని అనుపమ అంటుంది. వాళ్ళ ప్రేమే వాళ్ళని దగ్గరికి చేస్తుందని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధార అన్న మాటలు దేవయాని గుర్తుకు చేసుకొని ఏడుస్తుంటే శైలేంద్ర వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావ్ ? అ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావని అంటాడు. నిన్ను అంత చీప్ గా తీసి పారేస్తుంది. పైగా మెడ పట్టుకొని గెంటేయ్యమని చెప్పిందని దేవయాని అనగానే.. అప్పుడే ధరణి వచ్చి అయ్యో మిమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేసారా అంటూ కావాలనే వెటకారంగా మాట్లాడుతుంది. ఇద్దరిని గెంటేసారా అని ధరణి అంటుంది. అ తర్వాత దేవయాని చిరాకుపడుతూ ధరణిని పంపిస్తుంది. వసుధార అన్న మాటల కంటే దీని మాటలు ఎక్కువ బాధపెడుతున్నాయని దేవయాని అంటుంది. వసుధార ఎన్ని మాటలు అందో దానికి రెట్టింపు పగ తీర్చుకుంటానని శైలేంద్ర అంటాడు.
మరొకవైపు రిషి గురించి వసుధార ఆలోచిస్తుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి మీటింగ్ కీ వెళ్తున్నాను, నువ్వు త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. అదే మీటింగ్ కి దేవయాని కూడా వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని దేవయానిని ఫణింద్ర అడుగుతాడు. నేను తెలుసుకోవాలి కదా అని దేవయాని అంటుంది. ఇంకా ఎండీ గారు రాలేదా అని అనగానే వసుధారకి మహేంద్ర ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావని ఆడుగుతాడు. ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరుతున్నానని వసుధార చెప్తుంది. వసుధార బయలుదేర్తుండగా అప్పుడే తనకి ఒక కొరియర్ వస్తుంది. అందులో రిషి బ్రాస్ లైట్, ఒక లెటర్ ఉంటుంది. చెప్పిన అడ్రస్ కి వస్తే రిషి ఉంటాడు. త్వరగా రావాలని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఆ లెటర్ లో ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.