English | Telugu

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కి యానీ ఆన్స‌ర్ అదిరింది

బిగ్‌బాస్ సీజ‌న్ 5 షో ముగిసినా దాని వ‌ల్ల కంటెస్టెంట్ ల చుట్టూ ఏర్ప‌డిన వివాదాలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇటీవ‌ల ష‌న్ను, దీప్తిలు బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం... సిరి వారి బ్రేక‌ప్ కి నేను కార‌ణం కాదంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్ లో త‌నదైన స్టైల్లో డ్యాన్యుల‌తో ఇత‌ర కంటెస్టెంట్ ల‌పై విరుచుకుప‌డిన యానీ మాస్ట‌ర్ తాజాగా వార్త‌ల్లో నిలిచింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ని ట్రోల్ చేస్తున్న వారికి అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చింది.

బిగ్‌బాస్ హౌస్‌లో స‌న్నీ, మాన‌స్‌, కాజ‌ల్ ల‌తో యానీ మాస్ట‌ర్ గొడ‌వ‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కాజ‌ల్ తో యానీ ప్ర‌తీ సారి ఏదో ఒక విధంగా గొడ‌వ‌కు దిగి నాగిన్ అంటూ ఎద్దేవా చేయ‌డం, అరుపులు కేక‌ల‌తో త‌న‌పైకి వెళ్ల‌డం తెలిసిందే. హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ఇవ‌న్నీ వ‌దిలేసిన కంటెస్టెంట్ లు వీకెండ్ స‌మ‌యాల్లో క‌లిసి పార్టీలు చేసుకుంటున్నారు. కానీ కాజ‌ల్‌, స‌న్నీ మాత్రం పెద్ద‌గా ఏ పార్టీల్లో క‌నిపించ‌డం లేదు. ఇక యానీ మాస్ట‌ర్ మాత్రం పార్టీల్లో నే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ య‌మ యాక్టీవ్ గా వుంటోంది.

Also read: వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌

అయితే యానీ మాస్ట‌ర్ ని ఫాలో అవుతున్న ఓ నెటిజ‌న్ మీకు స‌న్నీ, మాన‌స్‌, కాజ‌ల్ గ్రూప్ అంటే ఎందుకంత ద్వేష‌మ‌ని, వారితో మీరు క‌లిస్తే చూడాల‌ని వుంద‌ని అడిగాడు. ఈ ప్ర‌శ్న‌కు స్ట‌న్నింగ్ రిప్లై ఇచ్చింది యానీ మాస్ట‌ర్. `నాకు ఎవ్వ‌రి మీద ద్వేషం లేదు. జీవితం చాలా చిన్న‌ది.. వాళ్లు మంచి స్నేహితులు. క‌ష్టాల్లో ఒక‌రికొక‌రు తోడుగా వున్నారు. నాకూ వాళ్ల‌తో క‌ల‌వాల‌ని వుంది కానీ కాస్త స‌మ‌యం ప‌డుతుంది. నాకు అంద‌రితో క‌ల‌వాల‌ని వుంది. కానీ అంద‌రూ బిజీగా వున్నారు అందుకే క‌ల‌వ‌లేక‌పోతున్నాం` అని చెప్పుకొచ్చింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.