వంటలక్క మరిదిని బుట్టలో వేసిన మోనిత
on Jan 3, 2022

బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. ఇందులో నటించిన కీలక నటీనటులు స్టార్ హీరోలని మించి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ నటులకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో టాప్ లో నిలిచిందంటే ఏ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఇన్ని వారాలు దాటుతున్నా టాప్ రేటింగ్ తో `కార్తీక దీపం` కొనసాగుతోంది.
ఇదిలా వుంటే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, దీపలకు చుక్కలు చూపిస్తున్న మోనిత (శోభా శెట్టి) .. ఇదే సీరియల్ లో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటిస్తున్న ఆదిత్య (యశ్వంత్) ని బుట్టలో పడేసిందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. `కార్తీక దీపం`లో వదినా, మరుదులుగా కనిపించిన శోభాశెట్టి, యశ్వంత్ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. `బుజ్జి బంగారం` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మోనిత (శోభాశెట్టి) తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
గాయం ఈశ్వర్‌రెడ్ది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వయంగా మోనిత (శోభాశెట్టి) నే నిర్మిస్తుండటం విశేషం. ఈ పోస్టర్ లో శోభాశెట్టి.. యశ్వంత్ వీపుపై ఎక్కి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ ఏంటీ మోనిత డాక్టర్ బాబుని వదిలేశావా? .. వంటలక్క మరిదిని ఇలా బుట్టలో వేశావా? అంటూ కామెంట్ లు కురిపిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



