English | Telugu
`కామెడీ స్టార్స్`లో థర్డ్ వేవ్ కలకలం!
Updated : Jan 6, 2022
ప్రతీ ఆదివారం హాస్యప్రియుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో `కామెడీస్టార్స్`. `స్టార్ మా`లో గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓంకార్ సమర్పిస్తున్న ఈ షోకి శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి జడ్జెస్ గా వ్యవహరించేవారు కానీ సీజన్ మారింది. శ్రీదేవి స్థానంలో మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్ గా వచ్చేశారు. అదే సమయంలో ఈ షోలోకి అదిరే అభి అండ్ టీమ్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
Also read:సుడిగాలి సుధీర్‌కి రష్మీ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ ఆదివారం అదిరే అభి టీమ్ హంగామా చేయబోతున్నారు. ఈ టీమ్ ప్రత్యేకంగా చేసిన స్కిట్ నవ్వులు పూయించబోతోంది. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని రిలీజ్ చేశారు. `సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్ వేర్` అనే కాన్సెప్ట్ తో ఈ ఆదివారం అదిరే అభి టీమ్ చేసే హంగామా ఓ రేంజ్ లో వుండబోతోంది. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ హంగామాతో అదిరే అభి టీమ్ నవ్వులు పూయించబోతోంది. ఇదే సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో థర్డ్ వేవ్ అంటూ వీళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Also read:వంటలక్క మరిదిని బుట్టలో వేసిన మోనిత
ఇంతకీ థర్డ్ వేవ్ సృష్టించిన కలకలం ఏంటీ? వైరస్ రాకుండా సౌత్ ఆఫ్రికా సాఫ్ట్ వేర్‌కి అదిరే అభి క్రియేట్ చేసిన డ్రెస్ ఏంటీ? .. అది వైరస్ నుంచి అతన్ని ఎలా కాపాడింది? .. ఈ క్రమంలో అదిరే అభి టీమ్ చేసిన రచ్చ ఏంటీ అన్నది చూడాలంటే ఈ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం కానున్న కామెడీ స్టార్స్ చూడాల్సిందే. ప్రోమో చివర్లో హరిపై యాదమ్మ రాజు వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది. ఈ షోకి నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తుండగా.. శ్రీముఖి హోస్ట్ గా ఆకట్టుకుంటోంది.