English | Telugu
యష్, వేద మధ్య గొడవకు కారణం?
Updated : Jan 5, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ పాప నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సీరియల్ ని దర్శకుడు రూపొందిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ బుధవారం సరికొత్త మలుపు తీసుకోబోతోంది. వేదని మచ్చిక చేసుకొని ఖుషీని దక్కించుకోవాలని అటు మాళవిక, ఇటు యకశోధర్ తల్లి ప్రయత్నాలు మొదలుపెడతారు.
Also read:వేద..యష్ కి అండగా నిలుస్తుందా?
ఆ ప్రయత్నంలో యశోధర్ తల్లి మాలిని అడ్డంగా వేద తల్లికి దొరికిపోతుంది. కట్ చేస్తే బుధవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. ఖుషీ కోసంవేద మధనపడుతున్న తీరు, యష్ ని మార్చాలని చూపిస్తున్న కేర్ ని గమనించిన యష్ తండ్రి, ఖుషీపై వేద చూపిస్తున్న ప్రేమని గమనించిన ఆమె తండ్రి ... ఇద్దరూ కలిసి వేద, యష్ లకు వివాహం చేస్తే బాగుంటుందని భావిస్తారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల వాళ్లకు చెప్పాలని స్వీట్ లు పంచేస్తారు.
Also read:వంటలక్క మరిదిని బుట్టలో వేసిన మోనిత
ఇదే విషయాన్నివేదకు చెబితే తన డిక్షనరీలోనే పెళ్లి అనే పదం లేదని చెబుతుంది. యష్ కూడా తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదంటాడు. కట్ చేస్తే వేద, యష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు.. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది... ఇద్దరూ ఆఫీస్ లకి వెళ్లిపోతారు. అయితే యష్ ఫాదర్ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడని వేదకు తెలుస్తుంది. ఇదంతా యష్ కి తెలిసే జరిగిందని వేద ఆగ్రహిస్తుంది. ఆవేశంతో రగిలిపోతూ యష్ ని నిలదీస్తుంది. ఈ గొడవ ఈ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందా? .. లేక దగ్గర చేసిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.