English | Telugu

గజ్జెలు పంపిన చైల్డ్ హుడ్ క్రష్..దేవుడి గదిలో పెడతానన్న ఇంద్రజ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఈ షో కాన్సెప్ట్ "నైట్ కాలేజీ"..ఇందులో హైపర్ ఆది సీనియర్ స్టూడెంట్ గా చేసాడు. ఇక భావన ఆరెంజ్ కలర్ శారీలో నైట్ కాలేజీ టీచర్ గా వచ్చి అదరగొట్టే డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది. అలాగే కొంతమంది గర్ల్స్ స్కూల్ యూనిఫార్మ్స్ లో వచ్చి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. అందులో ఒక అమ్మాయి ఇంద్రజాని ఏడిపించేసింది. తన డాడీకి ఇంద్రజ అంటే చైల్డ్ హుడ్ క్రష్ అని చెప్తూ ఆయన పంపారని ఒక గిఫ్ట్ కూడా ఆమె కోసం తీసుకొచ్చి ఇచ్చింది. ఇంద్రజ ఆ గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాకయ్యింది.

ఎందుకంటే అవి కాళ్లకు పెట్టుకుని నాట్యం చేసే గజ్జెలు. అవి చూసి కన్నీళ్లు పెట్టేసుకుంది ఇంద్రజ.. ఆ గజ్జెలు తనకు ఎంతో విలువైనవి అని ఇక ముందు ఆ అపురూపమైన గజ్జెలు ఇక ముందు తన పూజ గదిలో ఉంటాయి అని చెప్పింది. ఆ ఆన్సర్ కి ఆ గర్ల్ డాన్సర్ వెళ్లి ఇంద్రజాని హగ్ చేసుకుంది. ఇంద్రజ గతంలో కూడా ఇదే స్టేజి మీద గజ్జె కట్టి డాన్స్ చేసి ఏడ్చేసింది.

మళ్ళీ డాన్స్ చేసే అవకాశం రాదు అనుకున్న టైములో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మళ్లీ ఒక డాన్సర్ గా డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించడం అందరూ తనని మెచ్చుకోవడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఐతే ఇంద్రజ తన చిన్నప్పుడే సంగీతం, శాస్త్రీయ నృత్యంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి అండ్ టీమ్ తో పాటు పర్యటించి ఫారెన్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. స్కూల్ లో కూడా ఇంద్రజ అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. ఇక లైఫ్ లో పెళ్లి, పిల్లలు, ఇండస్ట్రీతో సరిపోయేసరికి డాన్స్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది అంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. ఇలా గజ్జెలు కనిపిస్తే చాలు ఆమెకు గత జ్ఞాపకాలు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.