English | Telugu

గొంతు మడతపెట్టి పాడితే గమకాలు తిరగాలే...రాహుల్ సిప్లిగంజ్ కామెంట్

శ్వేతా మోహన్ ప్లేబ్యాక్ సింగర్ గా అందరికీ తెలుసు. ఆమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో పాడింది. శ్వేత తల్లి సుజాత మోహన్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ , హిందీ భాషలలో 4000 పాటలు పాడారు. శ్వేత తొమ్మిదేళ్ల వయస్సులో గురువు రామమూర్తి రావు వద్ద కర్ణాటక సంగీతంలో ట్రైనింగ్ తీసుకున్నారు. రీసెంట్ గా శ్వేతా మోహన్ "సర్" మూవీ "మాష్టారు మాష్టారు" అంటూ సాగే మెలోడీ సాంగ్ ని అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈమె తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వారం ప్రసారమైన ఈ షోలో శ్వేతా మోహన్, తన తల్లి సుజాత మోహన్ తన కూతురు శ్రేష్ఠతో కలిసి ఉన్న పిక్ ని చూపించేసరికి చాలా సంతోషపడిపోయింది. "నా కూతురితో ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేదు.

మొదటి నుంచి అలా కనెక్ట్ ఐపోయాం ఇద్దరం. మా అమ్మకు మనవరాలి ప్రపంచం..ఆమెకు ప్రతీ రోజూ పండగే..ఆమెతో ఆడుకుంటూ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. శ్రేష్ఠ బ్లడ్ లోనే సింగింగ్ ఉంది. అప్పుడప్పుడు పాడుతోంది. ప్రస్తుతానికి చాల చిన్నది కదా...వయసు పెరిగే కొద్దీ పాడుతుంది." అని చెప్పింది శ్వేతా. ఇక ఈమె చెప్పిన మాటలకు శ్రీముఖి "త్వరలో అంటే సూపర్ సింగర్ షో అయ్యేలోపు సుజాత మోహన్ ని, శ్వేతా గారిని, శ్రేష్ఠను ఒకే స్టేజి మీద చూడాలి అనుకుంటున్నాను" అని చెప్పింది. "అవ్వచ్చేమో చూద్దాం" అంది శ్వేతా మోహన్. తర్వాత స్టేజి మీదకు అమృతా నాయక్ అనే సింగర్ వచ్చి "కురిసింది మేఘం మేఘం" అనే సాంగ్ పాడింది. ఇక ఈమెకు జడ్జెస్ అంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ మార్క్స్ ఇచ్చారు. ఇక ఈమె సాంగ్ విన్న రాహుల్ సిప్లిగంజ్ మాత్రం "ఈమె సాంగ్ అర్ధం కావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి" అంటూ సరదాగా కామెడీ చేసాడు. నీకోసమే ఈ డైలాగ్ అంటూ "గొంతు మడతపెట్టి పాడితే గమకాలు తిరగాలే" అని కితాబిచ్చాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..