English | Telugu
దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ హౌస్ లో 'సర్దార్' సందడి
Updated : Oct 24, 2022
మాములుగా సండే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో పండుగలా ఉంటుంది. అలాంటిది దీపావళి పండుగే కావడంతో, అటు గెస్ట్ లు, ఇటు కంటెస్టెంట్స్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించిందనే చెప్పాలి.
దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన సెలబ్రిటీలు మాస్ డ్యాన్స్ లతో , క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ దుమ్ములేపారు. గెస్ట్ సాంగ్ లో జబర్దస్త్ యాంకర్ 'రష్మి' హాట్ సాంగ్ కి కిల్లింగ్ ఎక్స్పెషన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన అంజలి కూడా అధ్బుతమైన పర్ఫామెన్స్ ఇవ్వగా, స్పెషల్ గెస్ట్ గా 'కార్తి' వచ్చాడు. ఇలా ఒక్కొక్కరుగా మంచి కిక్ ఇచ్చే పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు పండుగ రుచిని చూపించేసాడు బిగ్ బాస్.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దీపావళి సంబరాలు జరిగాయి. తారల డాన్స్ లు, సింగర్స్ పాటలు, కమెడియన్ కామెడీ, హీరో రాక వీటన్నింటితో ఒక్కరోజు ముందుగానే దీపావళి జరుపుకుంది బిగ్ బాస్ హౌస్. మొదటగా నటి అంజలి కంటెస్టెంట్స్ తో ముచ్చటించి, తర్వాత హౌస్ మేట్స్ పెయిర్ డాన్స్ చూసింది. ఆ తర్వాత వచ్చిన శ్రీరామచంద్ర తన సాంగ్ పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్మెంట్ చేసాడు. హైపర్ అది హౌస్ మేట్స్ అందరి గురించి చెప్పడం. తర్వాత కార్తీ వచ్వాడు. తన కొత్త సినిమా సర్దార్ మూవీ ప్రమోషన్ కి రావడంతో స్టేజి మరింత కళకళలాడింది అనే చెప్పాలి. హౌస్ మేట్స్ కి స్వీట్స్ తెచ్చిన కార్తీ నామినేషన్ లో ఉన్న వాళ్లలో ఇద్దరినీ సేవ్ చేసాడు. తరువాత హౌస్ మేట్స్ తో సాగిన చిన్న గేమ్ లో పాల్లొన్నాడు. తర్వాత కంటెస్టెంట్స్ కి అల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు కార్తీ.
టీవి చూసే ప్రేక్షకులకు ఈ దీపావళి రోజున బిగ్ బాస్ లో జరిగిన సంబరాలు ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి.