English | Telugu

వీడియో బ‌య‌ట‌పెడ‌తానంటూ ఐశ్వ‌ర్య‌కు శ్యామా వార్నింగ్‌!


రత్తమ్మ నిర్దోషి అన్న విషయాన్ని నిరూపించాలని డిసైడ్ అవుతుంది శ్యామా. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి రత్తమ్మను పరామర్శిస్తుంది. "నీ నిజాయితీనే నిన్ను చావకుండా బతికించింది" అంటూ రత్తమ్మకు ధైర్యం చెప్తుంది. తర్వాత నెమ్మదిగా అసలేం జరిగిందో కూపీ లాగుతుంది. ఆ రోజు కొడుకుని స్కూల్ కి జాగ్రత్తగా వెళ్ళమని ఇంటి తాళం ఇచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్లినట్లు చెప్తుంది రత్తమ్మ. వెంటనే శ్యామా.. రత్తమ్మ కొడుకు చిన్నాను అడుగుతుంది 'కొత్త మనుషులు ఎవరైనా మీ ఇంటి చుట్టూ పక్కల కనిపించారా' అని. చిన్నా చాలా సేపు ఆలోచించి ఒక కారు కనిపించిందని దాన్ని ఫోటో కూడా తీసుకున్నానని ఆ ఫోటో చూపిస్తాడు. అప్పుడు శ్యామాకి అసలు విషయం అర్థమైపోతుంది.

వెంటనే ఫ్యాక్టరీకి వెళ్లి మేనేజర్ ని నిలదీస్తుంది. ఐశ్వర్యనే తన చేత ఇలా చేయించిందని అత‌ను మొత్తం నిజం చెప్పేస్తాడు. అతని మాటల్ని మొత్తం వీడియో రికార్డు చేస్తుంది శ్యామా. సరిగ్గా అదే సమయానికి ఐశ్వర్య కూడా వస్తుంది. శ్యామాకి నిజం తెలిసిపోయేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది.

శ్యామా మాత్రం రత్తమ్మ చేసే పనులన్నీ తాను చేయాలని వచ్చిన కూలి డబ్బులన్నీ రత్తమ్మకు ఇస్తేనే న్యాయం జరుగుతుందని ఐశ్వర్యకు గట్టిగా చెప్తుంది. చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోని ఇంట్లో అందరికి చూపించి, అస‌లు ర‌హ‌స్యం బ‌య‌ట‌పెడ‌తాన‌ని వార్నింగ్ ఇస్తుంది. ఇక తప్పక శ్యామా చెప్పినట్టు చేయడానికి సరే అంటుంది ఐశ్వ‌ర్య‌. మిగతా హైలైట్స్ అన్ని ఈరోజు మధ్యాహ్నం జీ తెలుగులో ప్రసారమయ్యే 'కృష్ణతులసి' సీరియల్ లో చూడొచ్చు..