English | Telugu

ప్రతి సీజన్‌కీ ఒక రేలంగి మావయ్య ఉంటాడు!

బిగ్ బాస్ సీజన్ 6 దీపావళి సందర్భంగా ఆదిని హౌస్ లోకి తీసుకొచ్చేసరికి మంచి పంచుల్ని టపాకాయల్ని పేల్చినట్టు పేల్చేసాడు. 'ప్రతీ బిగ్ బాస్ సీజన్ కి ఒక ప్రవచన కర్త, ఒక రేలంగి మావయ్య ఉంటాడు. ఈ హౌస్ లో అతను ఎవరంటే బాలాదిత్య. "గీతూ వల్లే మీరు సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారు. అది తెలీక గీతూ వెళ్లి మీ సిగరెట్లను త్యాగం చేసింది.

ఇక హోటల్ టాస్క్ తర్వాత గీతూకి ఆ 100 రూపాయలు ఇచ్చేసి ఉంటే నీకు 100 ఎపిసోడ్ల టార్చర్ తప్పేది కదా. నువ్వు హౌస్ లోంచి బయటకి వచ్చాక నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఎవరూ ఆలోచించుకోవక్కర్లేదు. అన్ని సిగరెట్ బ్రాండ్స్ తీసుకొచ్చి నీ ముందు పెడతారు. బాలాదిత్య బాయట ఎలా ఉన్నాడో హౌస్ లో కూడా అలాగే ఉన్నాడు. ఏ పాయింట్ ఐనా కరెక్ట్ అనుకున్నప్పుడు ఒక సారి చెప్తే చాలు దాని గురించి ప్రతీ సారీ సంజాయిషీ ఇవ్వక్కర్లేదు" అంటూ చెప్పాడు.

ఇక మరీనా, రోహిత్ గురించి చెప్తూ " మీ హౌస్ కి ఈ బిగ్ బాస్ హౌస్ కి ఒకటే తేడా..ఇక్కడ మరీనా వంట గదిలో ఉంటుంది, రోహిత్ గేమ్ ఆడతాడు..వాళ్ళ ఇంట్లో రోహిత్ కిచెన్ లో ఉంటాడు. మరీనా గేమ్స్ ఆడుకుంటది..బిగ్ బాస్ ఎడిటర్లకు చాలా వరకు పని తగ్గించేది మీరే" అంటూ ఇద్దరి మీద సెటైర్స్ వేసాడు.