సంగీత్‌లో యష్ - వేద అడ్డంగా దొరికిపోయారా?
on Feb 23, 2022

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని, పిల్లలని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. వేద కోసం ఖుషీ గిఫ్ట్ అందిస్తుంది. `వరల్డ్ బెస్ట్ మదర్` పేరుతో వున్న గిఫ్ట్ ని చూడగానే వేద ఎమోషనల్ అవుతుంది. 'ఇది వరల్డ్ లోనే బెస్ట్ గిఫ్ట్.. ఇంత గొప్ప గిఫ్ట్ ఇంత వరకు నాకు ఎవరు ఇవ్వలేదం'టూ మురిసిపోతుంది. కట్ చేస్తే.. యష్ , వేదల సంగీత్ మొదలవుతుంది.
Also Read: నయని ప్రయోగం ఫలించిందా?
వేద, యష్ ఫ్యామిలీలు కలిసి సంగీత్ లో హంగామా చేస్తుంటారు. వేద, యష్ వచ్చేస్తారు. వేద సోదరి భరతనాట్యంతో సంగీత్ ని స్టార్ట్ చేస్తుంది. ఇదే సమయంలో వేదకు గిఫ్ట్ ఇవ్వాలని నెక్లెస్ ఖరీదు చేస్తుంది మాళవిక. ఆ నెక్లెస్ ని వేదకు అందజేసి తనని తమ వైపు తిప్పుకోవాలని మనసులో అనుకుంటుంది. వేద ఇంటికి మాళవిక బయలుదేరుతున్న సమయంలో అభిమన్యు ఎదురుపడతాడు. వేదకు ఖరీదైన నెక్లెస్ కొన్నానని, దీంతో తనని మన వైపుకు తిప్పుతానని చెబుతుంది. దానికి అభిమన్యు 'సరే వెళ్లు' అంటాడు.
Also Read: రానా తమ్ముడు అభిరామ్ అ'హింస'తో భయపెడుతున్నాడు
కట్ చేస్తే సంగీత్ లో యష్ తల్లి మాలిని, అక్క కంచు హడావిడీ చేస్తుంటారు. వేద ఫ్యామిలీని ఆట పట్టించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే క్రమంలో యష్, వేదల మధ్య ఫన్నీ మాటల యుద్ధం జరుగుతుంది. కట్ చేస్తే అంతే సరదాగా డ్యాన్స్ చేస్తుంటారు. యష్ , వేద కూడా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయి స్టేజ్ పై డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదే టైమ్ లో వేద కోసం మాళివిక సంగీత్ ఫంక్షన్ లోకి ఎంట్రీ ఇస్తుంది.. స్టేజ్ పై యష్, వేద కలిసి డ్యాన్స్ చేస్తుండటం చూసి షాక్ అవుతుంది. యష్ పెళ్లి చేసుకోబోయేది వేదని అని తెలుసుకుంటుంది. ఆ తరువాత మాళవిక ఎలా రియాక్ట్ అయింది?.. అభిమన్యు ఈ వార్త విని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



