English | Telugu

నెక్స్ట్ మూవీలో హీరోయిన్‌ని ఆర్జీవీలా రకరకాల యాంగిల్స్ లో చూపిస్తా!

సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, నటుడు జీవన్, డైరెక్టర్ నాని కాసరగడ్డ వీళ్లంతా వచ్చారు. ఇక రాపిడ్ ఫైర్ రౌండ్ లో వీళ్ళను ఎన్నో ప్రశ్నలు వేసింది సుమ. "అల్లరి నరేష్ తో చేసిన మూవీస్ లో మీకు నచ్చిన సినిమా ఏది. మారేడుమిల్లి ప్రజానీకం, 12 ఏ రైల్వే కాలనీ" అని అడిగింది. "నాకు 12 ఏ రైల్వే కాలనీ అంటే ఇష్టం" అని చెప్పింది. ఇక నరేష్ ఐతే అందులో చిన్న క్యారెక్టర్ ఇందులో ఫుల్ క్యారక్టర్ చేసాను అని చెప్పాడు. "ఈ ఇద్దరు హీరోల్లో ఒకేసారి ప్రొపోజ్ చేస్తే ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు. ప్రభాస్, విజయ్ దేవరకొండ" అని అడిగింది. "ప్రభాస్" అని చెప్పింది కామాక్షి. తర్వాత డైరెక్టర్ నానిని పిలిచింది. " 12 ఏ రైల్వే కాలనీ మూవీకి ఏ ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు" అని అడిగింది. "అల్లరి నరేష్" అని చెప్పాడు. కామాక్షి స్పందన తెలుసుకుందాం అంటూ కామాక్షి ఎలా ఫీలవుతున్నావ్ ఈ ఆన్సర్ మీద అని అడిగింది సుమ. నో కామెంట్స్ అని చెప్పింది.

"నెక్స్ట్ మీరు తియ్యబోయే సినిమాలో హీరోయిన్ ని ఈ విధంగా చూపించబోతున్నారు. రాధావేంద్రరావు గారిలా పళ్లతో, ఆర్జీవీలా రకరకాల యాంగిల్స్ లో" అని అడిగింది. "ఆర్జీవీలా రకరకాల యాంగిల్స్ లో" అని చెప్పాడు. వెంటనే నరేష్ "త్వరలో పెళ్లి ఉంది నాని" అంటూ కామెడీ చేసాడు. తర్వాత రైటర్ అనిల్ ని పిలిచింది. " ఏ రెండు ప్రొఫెషన్స్ కి న్యాయం చేశామని అనుకుంటున్నారు..డాక్టర్, డైరెక్టర్" అంది. ఐతే అనిల్ యాక్టర్ కావాలుకుంటున్నారన్న విషయాన్నీ అల్లరి నరేష్ చెప్పాడు. తర్వాత అల్లరి నరేష్ ని పిలిచింది సుమ. "మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఏది ఇష్టం. గమ్యం మూవీలో గాలి శీను, శంభో శివ శంభో" అని అడిగింది. గాలి శీను రోల్ అని చెప్పాడు నరేష్. "మీరు చేసిన మల్టి స్టారర్ మూవీస్ లో ఏ హీరోతో కంఫర్ట్ గ అనిపించింది..రవితేజ, మహేష్ బాబు" అని అడిగింది. "ప్రొఫెషనల్ గా ఐతే మహేష్ గారు, పర్సనల్ గా సెట్ ఐతే రవితేజ గారితో ఎంజాయ్ చేయొచ్చు" అని చెప్పాడు.