English | Telugu
Illu illalu pillalu : విశ్వ బైక్ పై అమూల్య.. వేదవతి గుర్తుపట్టిందా!
Updated : Nov 21, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -321 లో.....ప్రేమని తీసుకొని ధీరజ్ రన్నింగ్ కి వెళ్దామనుకుంటే అప్పుడే శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. తనని దాటుకొని ఎలా వెళ్ళాలని ఇద్దరు లోపలికి వెళ్తారు. మరొకవైపు నర్మద, సాగర్ గుడికి బయల్దేరతారు. శ్రీవల్లిని చూసి వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆ తర్వాత ప్రేమని చీర కట్టుకోమని ధీరజ్ చెప్తాడు.
ప్రేమ చీర కట్టుకుంటుంది. ఇద్దరు బయటకి వెళ్తుంటే రామరాజు చూసి ఎక్కడికి అని ఆడుగుతాడు. గుడికి నాన్న అని ధీరజ్ అంటాడు. నాకు ఏదో డౌట్ గా ఉందని శ్రీవల్లి అంటుంది. వాళ్ళు గుడికి వెళ్తున్నారు.. డౌట్ ఏం లేదని రామరాజు అంటాడు. మరొకవైపు నర్మద, సాగర్ ఇద్దరు గోడ దూకి వెళ్తుంటే.. అప్పుడే శ్రీవల్లి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతుంది. నర్మద ఏదో ఒకటి కవర్ చేస్తుంది. ఆ తర్వాత నర్మద, సాగర్ గోడదూకి గుడికి వెళ్తారు. సాగర్ VRO రిజల్ట్స్ బాగా రావాలని నర్మద మొక్కుకుంటుంది. గవర్నమెంట్ జాబ్ వస్తే మీ నాన్న నన్ను అల్లుడిగా అంగీకరిస్తాడు.. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావని సాగర్ అంటాడు.
మరొకవైపు అమూల్య కాలేజీకి వెళ్తుంటే విశ్వ వచ్చి బైక్ ఎక్కు కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తానని అంటాడు. విశ్వ ఇచ్చిన గొలుసు అమూల్య మెడలో వేసుకుంటుంది. అది చూసి విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతాడు. విశ్వ రిక్వెస్ట్ చేయడంతో అమూల్య తన బైక్ ఎక్కుతుంది. వాళ్ళు వెళ్తుంటే రామరాజు, వేదవతి ఎదురుపడతారు. రామరాజు వాళ్ళని చూడడు కానీ వేదవతి చూసి విశ్వ బండి అమూల్య ఎక్కడం ఏంటని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.