English | Telugu

బొప్పాయి తిన్న స్వప్నపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -133 లో.. స్వప్న హాల్లో కూర్చొని బొప్పాయి తింటూ ఉంటుంది. అక్కడే అందరు ఉంటారు. స్వప్న బొప్పాయి తినడం అపర్ణ చూసి.. ఏం తింటున్నావని అడుగుతుంది. బొప్పాయి తింటున్న అని స్వప్న అనగానే.. అందరూ షాక్ అవుతారు. కడుపుతో ఉన్న అమ్మాయి ఎవరైనా బొప్పాయి తింటారా? నీకు తెలియపోతే ఎవరినైనా అడగాలి కదా అని అపర్ణ స్వప్నపై కోప్పడుతుంది. వెంటనే డాక్టర్ ని పిలిచి చెకప్ చెయ్యాలని అపర్ణ అంటుంది. డాక్టర్ వస్తే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం విషయం తెలుస్తుందని స్వప్న టెన్షన్ పడుతుంది. రాజ్ ని డాక్టర్ కి కాల్ చేసి రమ్మని ఇందిరాదేవి అంటుంది.

ముద్దుల్లేకుండా తీస్తారా...ఆర్జీవీ గారు నన్ను వదలటంలేదు!

ఈటీవీలో రీసెంట్ గా "ఆలీతో ఆల్ ఇన్ వన్" అనే గేమ్ షో ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ షో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక హోస్ట్ ఆలీ చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఇక ఈ వారం ఎపిసోడ్ కి ఆరియానా, మెహబూబ్, అలీ రెజా వచ్చారు. ఇందులో హోస్ట్ ఆలీని బావా, బావా అంటూ రకరకాలుగా టీజ్ చేసింది ఆరియానా. వీళ్ళ ముగ్గురితో రకరకాల గేమ్స్ ఆడించారు ఆలీ. ఫస్ట్ రౌండ్ "నేడే చూడండి" లో మెహబూబ్ వచ్చి గేమ్ ఆడి టవర్ ఫ్యాన్ ని గెలుచుకున్నాడు. ఇక నెక్స్ట్ రౌండ్ "నేనైతే"లో స్క్రీన్ మీద ఇచ్చిన పిక్చర్స్ ని అల్లి ఒక కథ చెప్పాలన్నమాట...ఇందులో ముగ్గురూ రకరకాల కథలు చెప్పారు.

నేను బాగానే ఉన్నాను...ఆ పుకార్లను నమ్మొద్దు

షూటింగ్ టైములో తన  కాలికి గాయం అయ్యిందని దాంతో  హాస్పిటల్ లో చేరినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఒక మెసేజ్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.  "ప్రియమైన అందరికీ , నేను ఆరోగ్యంగానే ఉన్నాను, షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను మీరంతా దయచేసి నమ్మొద్దు. నేను బాగున్నానన్న విషయాన్ని  మీ అందరికీ తెలియజేయడానికి ఇది రాస్తున్నాను.  బోనాలు పండుగ నేపథ్యంలో ఒక సాంగ్  షూటింగ్ కోసం వెళ్ళాను..షూటింగ్ లో నాకు ఎలాంటి గాయాలు కాలేదు...ఇక నేను చేసిన డాన్స్ సూపర్ డూపర్ గా ఉండబోతోంది. దాన్ని మీరంతా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు." అని ఆ మెసేజ్ లో చెప్పారు.

నీ డాన్స్ నచ్చలేదు...నా కాళ్ళు విరిగిపోయినా కూడా డాన్స్ చేస్తాను

"నీతో డాన్స్" ఈ వారం ఎపిసోడ్ లో టీం బిలో  రెండు జంటల మధ్య మార్క్స్ విషయంలో కొన్ని క్లాషెస్ వచ్చాయి. ఆట సందీప్-జ్యోతి  చేసిన డాన్స్ కి 8 మార్క్స్ ఇచ్చారు అమరదీప్-తేజు జంట. ఆ తర్వాత ప్రియాంక-శివ్ ఇద్దరూ చేసిన పెర్ఫామెన్స్ కి కూడా 8 మార్క్స్ ఇచ్చారు..దీపా-సాగర్ మాత్రం 6 మార్క్స్ ఇచ్చారు. సందీప్-జ్యోతి జంట కూడా 6 మార్క్స్ ఇచ్చారు. ఇక శివ్ డాన్స్ మీద సందీప్ మాట్లాడాడు. "శివ్ నీ డాన్స్ నాకు నచ్చలేదు. ఇదంతా మీ కొరియోగ్రాఫర్ దే తప్పు. స్టేజి మీద ఎప్పుడు పెర్ఫార్మ్ చేసినా కూడా గర్ల్స్ , బాయ్స్ అలా పరిగెత్తుకుని రాకూడదు ..కొంచెం స్పేస్ ఇవ్వాలి. మీరు బాగా చేయగలరు..నేను ఇలా చేయొచ్చో లేదో తెలీదు...నేను గనక కొరియోగ్రాఫ్ చేస్తే చింపి చాట చేస్తాను..ప్రతీ సాంగ్ కి డిఫరెన్స్ అనేది చూపించాలి.

ఆయన నన్ను హగ్ చేసుకోకపోతే ఆరోజు ఇరిటేటింగ్ గా ఉంటుంది

"నీతోనే డాన్స్" షోలో ఈ వారం జంటలన్నీ బాగా డాన్స్ చేసి అందరినీ ఫిదా చేసేశాయి. కాస్ట్యూమ్స్, తీసుకున్న థీమ్ తో ఓ రేంజ్ దుమ్ము దులిపేసారు. అలాంటి జోడీస్ లో సాగర్-దీప జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు లాస్ట్ వీక్ కూడా మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఈ వారం కూడా చేసారు కానీ లాస్ట్ వీక్ వచ్చినన్నీ మార్క్స్ మాత్రం ఈ వారం రాలేదు. "సాగర్ నిన్ను ఎంత ఇష్టపడతాడు అనే టాపిక్ చాలామందిలో ఉంది..సాగర్ నిన్ను ఎంత ఇష్టపడతాడో చెప్పు:అని శ్రీముఖి అడిగేసరికి " ఈరోజు మార్నింగ్ ఫైట్ అయ్యింది. సెట్ కి రావడం ఆలస్యమైపోతుందని దీపాని క్యాబ్ బుక్ చేయమన్నాను...ఐతే దీపా పుచ్చకాయ కట్ చేస్తోంది.

రిషి కోసం వసుధార చెప్పిన అబద్ధం .. అందరికి క్షమాపణలు చెప్పిన కేడీబ్యాచ్! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -799 లో.. రిషి ఏంజెల్ కోసం చపాతి చేస్తుంటాడు. నువ్వు ఎందుకు ఎప్పుడు లవ్ లో ఫెయిల్ అయిన వాడిలాగా డల్ గా ఉంటావ్? నీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని రిషిని అడుగుతుంది ఏంజెల్. రిషి సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే ఏంజెల్ కి  వసుధార  కాల్ చేస్తుంది. నొప్పి తగ్గిందా అని అడుగుతుంది వసుధార.. తగ్గింది నువ్వు మా ఇంటికి రావొచ్చు కదా వసు.. నేను చపాతి చేస్తున్నాను, రిషి నాకు హెల్ప్ చేస్తున్నాడని వసుధారతో ఏంజెల్ అంటుంది. అలా ఏంజెల్ చెప్పగానే.. వసుధార, రిషి ఇద్దరు కలిసి చపాతీలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది వసుధార. కాసేపు‌ వాళ్ళిద్దరి మాటలు విన్న రిషి మౌనంగా ఉంటాడు. నాతో కలిసి చపాతి చేసినట్లే ఏంజెల్ తో కూడా కలిసి చేస్తున్నాడా... రిషి సర్ గురించి తప్పుగా అనుకోవద్దని వసుధార అనుకుంటుంది.

కృష్ణ, మురారీల అన్యోన్యత చూసి అసూయపడుతున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-193 లో.. కృష్ణ, మురారీ ఇద్దరు ఫామ్ హౌస్ లో ఉంటారు. వాళ్ళనే గమనిస్తూ ముకుంద ఉంటుంది. మురారి తన డైరీ కోసం గదిలోకి వెళ్ళి కృష్ణ తీసుకొచ్చిన బ్యాగ్ లో చూస్తుంటాడు. అందులో ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ, నాన్నల ఫోటోలు చూసి వారికి థాంక్స్ చెప్పుకుంటాడు. బ్యాగ్ మొత్తం వెతికినా డైరీ కనిపించకపోయేసరికి.. అది ముకుంద తీసిందేమోనని అనుమానం వస్తుంది. మరి ముకుంద చదివితే ఏం అవుతుంది.. కృష్ణని ప్రేమిస్తున్నాని, మమ్మల్ని విడదీయాలని చూస్తుందని మురారి అనుకుంటాడు. అది జరుగకూడదు ఒకసారి అమ్మకి కాల్ చేద్దామని రేవతికి కాల్ చేస్తాడు మురారి.

నటరాజ్ మాస్టర్ తో, యాదమ్మ రాజుతో డాన్స్ చేసిన రాధా, సదా

"నీతోనే డాన్స్" షో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఇరగదీస్తున్నారు కంటెస్టెంట్స్. ఈ వారం "ధూమ్ ధామ్ " టీంలోని నాలుగు జోడీలు అద్దిరిపోయే డాన్సులు చేసి జడ్జెస్ ని మెప్పించేసారు. జడ్జెస్ కూడా కంటెస్టెంట్స్ తో స్టేజి షేర్ చేసుకున్నారు. రావడంరావడమే మంచి కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో వచ్చారు . లాస్ట్ వీక్ చూసుకుంటే గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ ని  కావ్య, నిఖిల్ పొందారు. ఇక ఈ వారం ఆ ఛాన్స్ ని అందుకున్నారు నటరాజ్ మాస్టర్-నీతూ జోడి. లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్ డల్ గా అస్సలు సరిగా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఈ వారం మాత్రం ధూమ్ ధామ్ గా డాన్స్ చేసేసారు.

ఇక నవ్వడం నేనెప్పటికీ ఆపను...

"అనుమానస్పదం" మూవీ తో వెండితెరకు పరిచయమైన మెరుపు  హంసానందిని. ఆ తర్వాత ఎన్ని మూవీస్ లో నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈగ మూవీలో కనిపించింది  కాసేపే ఐనా కూడా కొంత పేరైతే వచ్చింది. కానీ ఆమె కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడింది. మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంటి ఎంతో మంది స్టార్  హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి నెమ్మదిగా  కోలుకుని.. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీళ్ళలో హంసానందిని కూడా ఒకరు. అలాంటి హంసానందిని ఆధ్యాత్మికత దిశగా అడుగులు వేస్తోంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటోంది. తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.