Read more!

English | Telugu

కృష్ణ, మురారీల అన్యోన్యత చూసి అసూయపడుతున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-193 లో.. కృష్ణ, మురారీ ఇద్దరు ఫామ్ హౌస్ లో ఉంటారు. వాళ్ళనే గమనిస్తూ ముకుంద ఉంటుంది. మురారి తన డైరీ కోసం గదిలోకి వెళ్ళి కృష్ణ తీసుకొచ్చిన బ్యాగ్ లో చూస్తుంటాడు. అందులో ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ, నాన్నల ఫోటోలు చూసి వారికి థాంక్స్ చెప్పుకుంటాడు. బ్యాగ్ మొత్తం వెతికినా డైరీ కనిపించకపోయేసరికి.. అది ముకుంద తీసిందేమోనని అనుమానం వస్తుంది. మరి ముకుంద చదివితే ఏం అవుతుంది.. కృష్ణని ప్రేమిస్తున్నాని, మమ్మల్ని విడదీయాలని చూస్తుందని మురారి అనుకుంటాడు. అది జరుగకూడదు ఒకసారి అమ్మకి కాల్ చేద్దామని రేవతికి కాల్ చేస్తాడు మురారి.

రేవతికి మురారి కాల్ చేయగానే.. మురారిని ఏం మాట్లాడనీయకుండా కృష్ణ ఎక్కడుందని రేవతి అడుగుతుంది. తను కిచెన్ లో ఉంది.. నేను రూంలో ఉన్నానని మురారి అంటాడు. ఇద్దరిని ఒకేదగ్గర ఉండమని చెప్పాను కదా.. నేను ఇప్పుడు కృష్ణకి కాల్ చేస్తాను.. నువ్వు ఎక్కడున్నా తనకి ఫోన్ చేసేసరికి నువ్వు తన పక్కన ఉండాలని మురారీతో రేవతి చెప్తుంది‌. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వెళ్తాడు. కృష్ణకి కాల్ చేసిన రేవతి.. మురారి పక్కన ఉన్నాడా? అని అడుగగా.. ఉన్నాడని కృష్ణ చెప్తుంది. సరే కలిసి హ్యాపీగా ఉండండని చెప్పి కాల్ కట్ చేస్తుంది రేవతి. ఆ తర్వాత ఇద్దరు కలిసి తోటలోకి వస్తారు.  కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు.

ఇక ఇద్దరు కలిసి వెళ్తుండగా.. కట్టెల పొయ్యిని చూస్తుంది కృష్ణ. దాని మీద వంట చేసకొని తిందామని కృష్ణ చెప్పగా సరేనని మురారి అంటాడు. ఆ తర్వాత కట్టెల కొట్టుకురమ్మని ముకుందకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కట్టెలపొయ్యి మీద అన్నం వండుతుంది కృష్ణ. ఇదంతా చాటుగా చూస్తూ ముకుంద అసూయతో రగిలిపోతుంది. అయితే మురారి కట్టెలు తీసుకొచ్చాక.. ఆకలి అవుతుందని అడుగగా.. సరే మీరు కూరగాయలు కట్ చేయండని మురారికి కృష్ణ చెప్తుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వాటిని లవ్ సింబల్ లో సెట్ చేస్తాడు మురారి. తన ప్రేమని కృష్ణ ఇలాగైనా కనిపెట్టాలని మురారి అనుకుంటాడు. మరొకవైపు ఇదంతా చాటుగా చూస్తున్న ముకుంద.. ఆ లవ్ సింబల్ లో ఉన్న ఉల్లిపాయ ముక్కలని  చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.