English | Telugu
ఇక నవ్వడం నేనెప్పటికీ ఆపను...
Updated : Jun 26, 2023
"అనుమానస్పదం" మూవీ తో వెండితెరకు పరిచయమైన మెరుపు హంసానందిని. ఆ తర్వాత ఎన్ని మూవీస్ లో నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈగ మూవీలో కనిపించింది కాసేపే ఐనా కూడా కొంత పేరైతే వచ్చింది. కానీ ఆమె కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడింది. మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి నెమ్మదిగా కోలుకుని.. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీళ్ళలో హంసానందిని కూడా ఒకరు. అలాంటి హంసానందిని ఆధ్యాత్మికత దిశగా అడుగులు వేస్తోంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటోంది. తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అలాంటి హంసానందిని రీసెంట్ గా ఇషా ఫౌండేషన్ కి వెళ్ళింది. దానికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. "ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే మనలో ఉన్న మూర్కత్వాన్ని వదిలిపెట్టడమే. ప్రతిదీ మనలోనే ఉంది కానీ మనమే దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్పాలి అంటే నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తిని అనుభవించాను. ఇప్పుడే ఈ క్షణాన్ని ఆస్వాదించాలి, బతకాలి అనే అందమైన అనుభూతి నాలో కలిగింది. ఇక నేను నవ్వడం ఎప్పటికీ ఆపను. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కి ధన్యవాదాలు..ఇక్కడి నన్ను ఆహ్వానించి, నాలో ఈ ఫీలింగ్ ని కలిగేలా చేసినందుకు" అని చెప్పారు హంసానందిని. రీసెంట్ గా ఆమె ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. రెండేళ్ల క్రితం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ , ఒవేరియన్ కాన్సర్ ఉందని దానికి కీమోలు కూడా తీసుకున్నానని చెప్పారు.. అలాగే కీమోలు తీసుకునేటప్పుడు జుట్టు ఓడిపోవడంతో గుండుతో ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు హంసానందిని ట్రీట్మెంట్ తీసుకుని మరింత ఎనెర్జీతో, మరింత అందంతో మళ్ళీ అందరి ముందుకు రావడంతో నెటిజన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ పాజిటివ్ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.