English | Telugu

ఇంతకు ఏమిటా "స్త్రీ"కారం...తన కొత్త షో ఏమిటో గెస్ చేయమని చెప్పిన శ్రీరామచంద్ర  

సింగర్ శ్రీరామచంద్ర అంటే చాలు పవన్ కళ్యాణ్ సాంగ్ "గెలుపు తలుపులే తీసే" అనేది గుర్తొస్తుంది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా గుర్తొస్తుంది. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో సింగర్ శ్రీరామ్ చంద్ర ఒకరు.. లవర్ బాయ్ ఇమేజ్ తో బిగ్ బాస్ లో టాప్ త్రీగా నిలిచాడు.. సోషల్ మీడియాలో కూడా శ్రీరామచంద్రకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ .ఆయన్ని అందరూ ముద్దుగా ఎస్ఆర్సి అని పిలుచుకుంటారు. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కి హోస్ట్‌గా వ్యవహరించారు శ్రీరామ చంద్ర.

అలాంటి శ్రీరామచంద్ర ఇప్పుడు ఆహా వేదిక మీద మళ్ళీ మెరవబోతున్నాడు. "సరికొత్త "స్త్రీ"కారంతో వస్తున్నాడు మీకోసం. సూపర్ సర్ప్రైజ్ మీకోసం త్వరలో రాబోతోంది. త్వరలో దానికి సంబందించిన డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. అప్పటి వరకు గెస్ చేస్తూ ఉండండి.." అంటూ శ్రీరామ చంద్ర పిక్ తో ఒక లేటెస్ట్ అప్ డేట్ ని ఆహా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక దీని మీద ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకు ఈ షో ఏమిటా అనే విషయం మీద నెటిజన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టెర్సారు. "ఓహ్ మై గాడ్...ఇదేమన్నా గేమ్ షోనా", "సూపర్ విమెన్ షోకి హోస్ట్ అనుకుంటా ""నెక్స్ట్ ఆహాలో ఒక మూవీ రాబోతోంది దానికి సంబంధించిన షాట్ అనుకుంటా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ షో ఏమిటి, ఎప్పుడు అనే విషయాలను ఆహా కానీ శ్రీరామచంద్ర కానీ రివీల్ చేయలేదు. మరి ఆ వివరాలు తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే. ఇక శ్రీరామచంద్ర ఎప్పుడు చూసినా బిజీ స్కెడ్యూల్ తోనే ఉంటాడు. ఫారెన్ లో షోస్ చేస్తూ సింగింగ్ ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈయన సింగర్ మాత్రమే కాదు నటుడు కూడా. 2013 లో తొలిసారి ఫేస్ కి మేకప్ వేసుకున్నాడు.జగద్గురు ఆదిశంకరాచార్యులు మూవీలో రాజా అమర్కరా పాత్రలో నటించాడు. ఆ తర్వాత 2014 లో "ప్రేమ గీమ జాంత నై" అనే మూవీలో హీరోగా లీడ్ రోల్ లో కనిపించాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.