English | Telugu

Brahmamudi : కొడుకుకి రెండో పెళ్ళి చేయాలనుకుంటున్న అత్త.. కోడలు నిజం బయటపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -430 లో....మాయ, రాజ్ ల పెళ్లికి ఇంట్లో బట్టలు సెలక్ట్ చేస్తుంటారు. అప్పుడే కావ్య వచ్చి అది చూసి షాక్ అవుతుంది.. కావ్య టలా వెళ్ళిపోతావేంటి మీ అయన పెళ్లికి నువ్వు కూడా చీర కొనుక్కో మా వదిన ఏం అనుకోదని రుద్రాణి అంటుంది. నువ్వు దూరంగా నిలబడ్డావ్.. పెళ్లి నీకే కదా చీరలు సెలక్ట్ చేసుకోమని మాయకి రుద్రాణి చెప్తుంది. నాకు సెలెక్ట్  చేసుకోవడం రాదని మాయ అనగానే.. నీకెందుకు తెలియదు అంత తెలుసని ధాన్యలక్ష్మి అంటుంది.

Krishna Mukunda Murari : మురారిని హాస్పిటల్ లో చేర్చిన కృష్ణ.. నిజం తెలుసుకున్న భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో.. మురారి, ముకుంద మాట్లాడుకుంటారు. కృష్ణ నిన్ను నమ్మడం జరగదు. నన్ను అనుమానించడం జరగదని మురారి అనగానే.. జరిగింది. కావాలి అంటే రేపు తను ఐ హేట్‌ యూ ఏసీపీ సర్ అనే వాయిస్ కూడా రికార్డ్ చేసుకొని తీసుకొని వస్తానని ముకుంద అంటుంది. ఆపు ముకుంద. అయినా నాకు నువ్వు ఇష్టం లేదు అని చెప్తున్నా ఎందుకు నన్ను పట్టుకొని పీడిస్తున్నావని మురారి అనగానే.. ఎందుకు అంటే ఎప్పటికైనా నీ మనసు మారుతుందని అని ముకుంద అనగానే.. అది ఎప్పటికి జరగదని మురారి అంటాడు.

Eto Vellipoyindhi Manasu : భార్య ఆచూకి కోసం భర్త వెతుకులాట.. ప్రియుడి భండారాం బయటపడేనా !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -117 లో......నన్ను రామలక్ష్మిని పెళ్లి బట్టల్లో రమ్మనడంలో అర్థం ఏంటని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. మరొకవైపు నేను అక్కడ లేనని అందరు నా గురించి ఏం అనుకుంటున్నారో.. సీతాకాంత్ సర్ తిడుతున్నారేమో.. ఎంత నిందిస్తున్నారో.. పాపం నా కారణంగా ఇదంతా అని రామలక్ష్మి ఏడుస్తుంది. ఆ తర్వాత అమ్మ మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. కాసేపట్లో రామలక్ష్మి లేచిపోయిందన్న నిజం అందరికి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలో అది చేద్దామని శ్రీలతతో సందీప్ అంటాడు.

Krishna Mukunda Murari : కృష్ణ మాస్టర్ మైండ్ సూపర్.. ఆ క్లూతో మురారి జాడ తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -489 లో... అందరూ భోజనం చేస్తుంటే కృష్ణ మాత్రం దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. అసలు ఏమి పట్టనట్టు ఏం జరగనట్టు ఎలా భోజనం చేస్తున్నారని అడుగుతుంది. లేకపోతే మీ భార్యాభర్తలు చేసిన ఘనకార్యానికి తిండి తిప్పలు మానేసి పస్తులు ఉండమంటావా? అని ఆదర్శ్ కోపంగా అడుగుతాడు. నన్ను దోషిలా చూస్తూ నేరస్థురాలిగా లెక్కకడుతున్నారా అని కృష్ణ భవానీని నిలదీస్తుంది. ఆమె మౌనంగా ఉండటంతో కృష్ణ కోపంగా అరుస్తుంది. ఎందుకంత ఆవేశమని మధు అంటాడు. తన కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని చెప్తున్నా వినకుండా మోసం చేసిన దాన్ని పక్కనే కూర్చోబెట్టుకుని తింటున్నారని కృష్ణ అరుస్తుంది.

నెమలికి నడకలు నేర్పిస్తున్న హరితేజ

హరితేజ బుల్లితెర మీద ఒకప్పుడు మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, తాళి కట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం ఇలా పలు సీరియల్స్ లో నటించి ఆడియన్స్ నుంచి మంచి పేరును సంపాదించింది. ఆతర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన "అఆ" మూవీతో వెండితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ సమంత పనిమనిషిగా నటించింది. అలాగే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది హరితేజ. అలాంటి హరితేజ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో ఆమె నెమలికి నడకలు నేర్పిస్తోంది. అదేనండి "నెమలికి నేర్పిన నడకలివి" అంటూ సప్తపది మూవీలోని సాంగ్ కి అద్భుతంగా  నాట్యం చేసి ఆ వీడియోని పోస్ట్ చేసింది. "వర్షం వచ్చినప్పుడు నేను నెమలిని అవుతాను" అంటూ ఒక టాగ్ లైన్ పోస్ట్ చేసింది.