English | Telugu

పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని స్వీట్స్ పంచిన రాజ్ వాళ్ళ నాన్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -64 లో.. బొమ్మలకు కలర్స్ వేస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. అసలు నిజం చెప్పు నేను వెళ్ళేలోపు నువ్వు మీ అక్కని పంపించేసావ్ కదా అని రాజ్ అడుగుతాడు.. అవును పంపించేసాను. ఇలా చెప్తే మీరు హ్యాపీగా ఉంటారా అని కావ్య అంటుంది. ఒక అమ్మయి అని చూడకుండా అందరి ముందు నన్ను లాక్కొచ్చి నేలమీద పడేసారు. ఇంతకన్నా అవమానం ఎక్కడ అయినా ఉంటుందా.. మీరు చేసిన ఈ అవమానం నేనెప్పటికి మర్చిపోనని కావ్య అంటుంది.

ఆ తర్వాత రాజ్ వాళ్ళ నాన్న వచ్చి సంతోషంగా అందరికి స్వీట్స్ పంచుతుంటాడు. రాజ్ కంపెనీ లో అడుగు పెట్టాడో లేదో పెద్ద కాంట్రాక్ట్ మనకు వచ్చిందని రాజ్ వాళ్ళ నాన్న అందరితో చెప్తాడు. ఇంటి కోడలు అడుగుపెట్టింది పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని రాజ్ నానమ్మ అనగానే.. కష్టపడ్డది మీ పిల్లలు, మనవడు.. వాళ్ళ పేర్లు కాకుండా ఎవరి పేరో ఎందుకని చెప్తారని అపర్ణ అంటుంది. ఎవరు ఏం అనుకున్నా కావ్య ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టడం వల్లనే ఇలా జరిగిందని రాజ్ నానమ్మ అంటుంది. అప్పుడు కావ్య కంగ్రాట్స్ అని రాజ్ కి చెప్తుంది. ఎంత శత్రువు అయినా థాంక్స్ చెప్పాలి.. అది సంస్కారం అని థాంక్స్ అంటాడు రాజ్. నీకు ఏం కావాలో కోరుకో అమ్మ అని కావ్యని రాజ్ వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. ఏం కోరుకోవాలి అమ్మమ్మ గారు.. నా భర్త అందరి నోళ్లు తీపి చేసాడు. కానీ ఒక మూలన ఉన్న నేను అతనికి గుర్తురాలేదని, భర్త ఆదరణ అడగాలా? మనిషిగా నన్ను గుర్తించని ఈ ఇంట్లో నేను ఏమని అడగాలని కావ్య అంటుంది. "నాకు అర్ధమైందమ్మ.. ఎవరికైనా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. నా కోడలు పెట్టిన ఆంక్షల వల్ల నువ్వు ఇన్ని రోజులు నీ పుట్టింటికి దూరంగా ఉన్నావ్.. కనీసం కావ్య ఫ్యామీలీ వాళ్ళతో ఫోన్ లో అయినా మాట్లాడే ఛాన్స్ ఇద్దామని రాజ్ నానమ్మ అనగానే.. వద్దు అక్కడికి ఇక్కడికి రాయబారాలు వద్దని అపర్ణ అంటుంది. కావ్య వాళ్ళ ఇంట్లో ఒక వేళ స్వప్న ఉంటే రెడ్ హ్యాండేడ్ గా పట్టుకోవచ్చని మనసులో రాజ్ అనుకుంటాడు. ఫోన్ లో వద్దు నేనే డైరెక్ట్ గా తన వాళ్ళతో మాట్లాడించి తీసుకొస్తానని రాజ్ అనగానే.. అపర్ణ కోప్పడతుంది. రాజ్ మంచి ఆలోచన చేసాడు అని రాజ్ నాన్న, ఇంట్లో వాళ్ళు అంటారు.

ఆ తర్వాత రాజ్, కావ్యలు వెళ్ళిపోతుంటే.. నా మాట అంటే ఈ ఇంట్లో ఎవరికీ విలువ లేదు అంటూ అపర్ణ బాధపడుతుంది. అలా కాదు అని రాజ్ చెప్పే ప్రయత్నం చేసినా అపర్ణ వినిపించుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.