English | Telugu

‘బ్రహ్మముడి’ సీరియల్ లో కావ్య జర్నీ అలా మొదలైంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే.. కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది.

అయితే తాజాగా దీపిక రంగరాజు ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియోని అప్లోడ్ చేసింది. 'బ్రహ్మముడి' సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది అంటూ ఆ వీడియోకి టైటిల్ ని పెట్టేసి.. అందులో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన నటీనటులను పరిచయం చేసింది దీపిక.

దీపిక మొదటగా తను ప్రతిరోజూ ఈ సీరియల్ కోసం ఎలా మేకప్ అవుతుందో వివరించింది. ఆ తర్వాత దీపిక 'బ్రహ్మముడి' సీరియల్ కోసం రెగ్యులర్ గా షూటింగ్ జరిగే ఇంటిని చూపించగా.. తర్వాత కెమెరా మెన్ ని, డైరెక్టర్ ని పరిచయం చేసింది. ఆ తర్వాత స్వప్న అలియాస్ హమీదా దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడించింది. ఇంతలో అక్కడికి రాహుల్ వచ్చాడు. కనకం, కృష్ణమూర్తిలతో మాట్లాడించిన కావ్య తను రోజు షూటింగ్ లో ఎలా గడుపుతుందో వివరించింది. బ్రహ్మముడి' కావ్యగా గుర్తించినందుకు ఈ సీరియల్ అభిమానులకు థాంక్స్ చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.