English | Telugu

కృష్ణకి అబద్ధం చెప్పి‌న మురారి.. రేవతికి ఆ మాస్టర్ ప్లాన్ తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -126 లో.. కృష్ణకి మురారి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. తనేమో మురారిని ఆటపట్టించాలని ఆటోలో వస్తూ మ్యూజిక్ వాల్యూమ్ పెంచుతుంది. అప్పుడు మురారి ఎక్కడ ఉన్నావ్ కృష్ణ సినిమా థియేటర్ లో ఉన్నావా అని అడుగుతాడు. రెండు నిమిషాల్లో మీ ఇంటిముందు ఉంటాను అనేసరికి మురారికి అర్థం కాదు.

మరోవైపు రేవతి గుడి నుండి వచ్చి.. భవానికి ప్రసాదం ఇస్తుంది. మీరు కూడా వస్తే బాగుండు అక్క అని భవానీతో రేవతి అంటుంది. మిమ్మల్ని కావాలనే పంపించాను కదా అని భవాని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే కృష్ణ రావడంతో తనకి ప్రసాదం ఇస్తుంది రేవతి. కృష్ణ ఆ ప్రసాదం తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణ గదిలోకి వెళ్ళేసరికి మురారి కూర్చొని ఆలోచిస్తాడు. అప్పుడు కృష్ణ వెళ్ళి నేను అనుకున్న పని జరగలేదని మురారీతో అంటుంది. మురారి కూడా నేను అనుకున్న పని కూడా జరగలేదంటూ కృష్ణ దగ్గరగా జరుగుతాడు. "ఏంటి.. అయస్కాంతం లాగా అతుక్కుపోతున్నావ్" అంటూ కృష్ణ అడుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి కృష్ణ వెళ్ళుపోతుంటే.. చీర కొంగు ఇరుక్కుపోవడంతో కృష్ణ మురారిపై పడుతుంది. ఆ తర్వాత ఈశ్వర్ దగ్గరికి రేవతి వెళ్లి.. ఇంట్లో మాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు.. దాని వల్ల కృష్ణకి ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం నేను ఊరుకోనని రేవతి అడుగగా.. ఏం చేసినా ఈ కుటుంబం కోసమే అని ఈశ్వర్ సమాధానమిస్తాడు. మరోవైపు కృష్ణ, మురారిలు బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావ్ నాకు ఇచ్చిన మాట ఎక్కడి వరకు వచ్చిందని భవాని అడుగుతుంది. పెద్దమ్మ నేను చూసుకుంటానులే అని మురారి అంటాడు. కృష్ణకి కొంచెం బయట పని ఉందంట.. అందుకే తీసుకెళ్తున్నానని మురారి చెప్తాడు. ఇక అక్కడే ఉన్న ముకుంద.. ఏసీపీనే కృష్ణని బయటకు తీసుకెళ్ళాలా అని అంటుంది. నా మొగుడు నన్ను తీసుకెళ్తాడు.. నీకేంటని కృష్ణ అనగానే అది విని మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముకుంద మాత్రం కోపంగా చూస్తుంది. ఇక ఇద్దరు బయటకు వెళ్తారు.

కృష్ణ, మురారిలు రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు మురారి మనం కాసేపు లవర్స్ లాగా ఉందామని అడగగానే.. కృష్ణ సరేనంటుంది. మురారి కృష్ణని కిట్టు అని, కృష్ణ మురారి ని ముర్రు అని సరదాగా పిలుచుకుంటారు. నిన్న మీ పెద్దమ్మ ఎందుకు పిలిచిందని కృష్ణ అడుగుతుంది. మురారి నందు గురించి చెప్తుండగా.. పెద్దమ్మ వద్దని చెప్పిందని చెప్పకుండా ఆగిపోతాడు. కంపెనీకి సంబంధించి మాట్లాడడానికని మురారి అబద్ధం చెప్తాడు. మీరు ఒక జంటకి పెళ్లి చేయాలని చెప్పాను కదా అని కృష్ణ అడుగగా.. పెళ్లి చేస్తానని మురారి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.