English | Telugu

నందుకి సీక్రెట్ గా పెళ్ళిచూపులు ఏర్పాటు చేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -124 లో.. కృష్ణ ఏదో ప్లాన్ చేస్తుందని భవాని అనుకుంటుంది. ఇక ముకుంద నువ్వు వెళ్ళు అని భవాని అనగానే.. ఉండనివ్వండి వదిన ముకుంద కూడా మన పార్టీనే అని ఈశ్వర్ అంటాడు. మురారి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ తతంగం అంతా జరిగి నందు మతిస్థిమితం కోల్పోయిందని భవాని అంటుంది. ఏంటి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది.. పెద్ద అత్తయ్య ఏంటి కృష్ణకి భయపడుతుందని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఇక శాంత అనే ఆమెకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది భవాని.

మరోవైపు గెస్ట్ హౌస్ లో కృష్ణ, మురారిలు ఉంటారు. కృష్ణ కిచెన్ లో ఏదో సౌండ్ అయితే భయపడుతుంది. ఇదే ఆసరాగా తీసుకొని కొద్దిసేపు కృష్ణని ఆటపట్టించాలని ఇంట్లో దెయ్యం ఉందని‌ కృష్ణని బెదిరిస్తాడు మురారి. కృష్ణ నిజంగానే భయపడుతూ కళ్ళు తిరిగిపడిపోతుంది. మురారి వాటర్ చల్లి లేపుతాడు. అదంతా కలగన్నానా అని అనుకుంటుంది కృష్ణ. నాతో ఏదో మాట్లాడాలన్నావ్ చెప్పు కృష్ణ అని మురారి అనగానే.. కాలేజీ లో చెప్తాను అంటుంది కృష్ణ. మరోవైపు రేవతి వాళ్ళని గుడికి పంపించి, నందుకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది భవాని. మురారికి ఫోన్ చేసి.. కృష్ణని కాలేజీకి పంపించాక, నువ్వు ఒక్కడివే ఇంటికి రా అని భవాని చెప్పడంతో.. సరే పెద్దమ్మ అని మురారి అంటాడు.

కృష్ణని కాలేజీకి పంపించి మురారి ఇంటికి వస్తాడు. అప్పుడే వస్తున్న మురారిని భవాని పిలిచి.. మన నందు గురించి తెలిసి తనని పెళ్లి చేసుకుంటా అంటున్నారని భవాని చెప్తూ.. నందు పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలని అంటుంది. ఒకసారి అబ్బాయితో మాట్లాడాలని మురారి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు. మా నందుకి మతిస్థిమితం లేదు.. మా నందుని పెళ్లి చేసుకోమని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా అని మురారి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.