English | Telugu

వంటలక్క ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

బుల్లితెరపై టీవీ సీరియల్స్ హవా ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఇంట్లో ఆడవాళ్ళు ఇష్టంగా చూసే ఈ సీరియల్స్ లో అత్తాకోడళ్ళ డ్రామా ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. అలాంటి వాటిల్లో కంటెంట్ కొంచెం బాగుంటే చాలు ఆ సీరియల్ సూపర్ హిట్ అవుతుంది. అలాంటిదే కార్తీకదీపం సీరియల్. ఈ సీరియల్ కోసం ప్రేక్షకులు పనులు మానుకొని మరీ ఎదురు చూసేవారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు టెలివిజన్ రంగంలో  ఈ సీరియల్ సంచలనం సృష్టించింది. కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల, దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ అంత బాగుంటుంది. దీపని ప్రతీ ఇంట్లో ఆడపడుచుల భావించారు. ఈ సీరియల్ ముందు నుంచే నిరుపమ్ పలు సీరియల్స్ లో నటించినా.. కార్తీక దీపంతోనే ఎక్కువ ఫేమ్ లభించిందని చెప్పాలి

మరదలితో గంగులు సాంగ్ కి డ్యాన్స్ చేసిన మానస్! 

మానస్ నాగులపల్లి.. బిగ్ బాస్ ఎంట్రీతో గుర్తింపు తెచ్చుకొని క్రేజ్ సంపాదించుకున్నాడు. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' సినిమాలో తొలిసారి చేసాడు. ఆ తర్వాత బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్ ద్వారా పరిచయమయ్యాడు. బిగ్ బాస్-5 ఎంట్రీ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు మానస్. ఆ సీజన్ లో టాప్-5 కంటెస్టెంట్ గా నిల్చాడు మానస్. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక మానస్ కి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. రీసెంట్ గా ప్రైవేట్ ఆల్బమ్ అయిన 'జరీ జరీ పంచె కట్టు' సాంగ్ కి  మానస్, విష్ణుప్రియ కలిసి డాన్స్ చేసారు. ఈ సాంగ్  ఎంత ట్రెండ్ సెట్ చేసిందో అందరికి తెలిసిందే. 

గున్నా గున్నా మామిడి  సాంగ్ ని న్యూస్ వెర్షన్ లో చదివిన న్యూస్ రీడర్స్

సర్కార్ సీజన్ 3 లాస్ట్ వీక్ ఎపిసోడ్ ఫుల్ న్యూసెన్స్ క్రియేట్ చేసింది. రీల్ వెర్సెస్ రియల్ న్యూస్ రీడర్స్ తో ఈ షోలో గేమ్స్ ఆడించాడు హోస్ట్ ప్రదీప్. న్యూసెన్స్ మూవీ నుంచి నవదీప్, బిందుమాధవి రాగా ఫేమస్ న్యూస్ రీడర్స్ ప్రత్యూష, సత్య యాళ్ల వచ్చారు. ఇక ఇందులో అడిగిన ప్రశ్నలకు బిడ్డింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఐతే ఇందులో ఒక వెరైటీ టాస్క్ ఇచ్చాడు ప్రదీప్.. "గున్నా గున్నా మామిడి" అనే సాంగ్ ని న్యూస్ వెర్షన్ లో చదవాలని చెప్పాడు. "గున్న గున్న మామిడి...పిల్ల రావే గున్న మామిడి తోటకు అంటున్న ప్రదీప్..ఇంతకు ఎవరిని రమ్మంటున్నాడు"  అని ప్రత్యూష