మావారు మాస్టారు.. అతి త్వరలో!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ ఎంత పాపులరో అందరికి తెలిసిన విషయమే.. 'మావారు మాస్టారు' అనే సరికొత్త ధారావాహిక త్వరలో వస్తున్నట్లుగా మేకర్స్ ప్రోమో ని రిలీజ్ చేసారు. అతి త్వరలో ప్రసారం కాబోతున్న ఈ 'మావారు మాస్టారు' సీరియల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వారు పసుపు కుంకుమ, ముద్ద మందారం, పున్నాగ, గీతాంజలి లాంటి గొప్ప సీరియల్స్ ని నిర్మించారు. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ గా సంగీత కళ్యాణ్, హీరోగా పృథ్వీరాజ్ నటిస్తున్నారు. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ సెల్వరాజ్ ఇందులో హీరోయిన్ కి నాన్నగా చేస్తున్నాడు. ముద్దమందారం ఫేమ్ భవానిరెడ్డి ఇందులో ముఖ్యపాత్రని పోషిస్తుంది.