English | Telugu

మరదలితో గంగులు సాంగ్ కి డ్యాన్స్ చేసిన మానస్! 

మానస్ నాగులపల్లి.. బిగ్ బాస్ ఎంట్రీతో గుర్తింపు తెచ్చుకొని క్రేజ్ సంపాదించుకున్నాడు. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' సినిమాలో తొలిసారి చేసాడు. ఆ తర్వాత బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్ ద్వారా పరిచయమయ్యాడు. బిగ్ బాస్-5 ఎంట్రీ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు మానస్. ఆ సీజన్ లో టాప్-5 కంటెస్టెంట్ గా నిల్చాడు మానస్. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక మానస్ కి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. రీసెంట్ గా ప్రైవేట్ ఆల్బమ్ అయిన 'జరీ జరీ పంచె కట్టు' సాంగ్ కి మానస్, విష్ణుప్రియ కలిసి డాన్స్ చేసారు. ఈ సాంగ్ ఎంత ట్రెండ్ సెట్ చేసిందో అందరికి తెలిసిందే.

అయితే తాజాగా మానస్, విష్ణుప్రియ కలిసి మరో పాటతో మనముందుకొచ్చారు. వీరిద్దరూ కలిసి 'గంగులు' పాటకి అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసారు. కాగా ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. మానస్ అటు ఆల్బమ్ సాంగ్స్, ఇటు ఈవెంట్స్.. మరొకవైపు బ్రహ్మముడి సీరియల్ తో బిజీ లైఫ్ ని గడుపుతున్నాడు. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ పాత్రలో మానస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్రహ్మముడి సీరియల్ లో రాజ్-కావ్యలు పెళ్లి చేసుకోగా.. కావ్యకి అక్కగా స్వప్న అలియాస్ హమీదా చేస్తుంది. హమీదా కూడా బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వచ్చిన సెలబ్రిటీ. హమీదాకి తెలుగులో మొట్టమొదటి సీరియల్ బ్రహ్మముడి కావడం విశేషం. హమీదా, మానస్ లు మంచి స్నేహితులు. అయితే తాజాగా మానస్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'గంగులు' పాటకి.. హామీద, మానస్ లు కలిసి డాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ వీడియోని హమీదా, మానస్ ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

మానస్, హమీదా కలిసి షేర్ చేసిన ఈ వీడియోని చూసిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్... నైస్ షేడ్స్ అంటూ కామెంట్ చేశాడు‌. అయితే మరొకరు.. మరదలితో రీల్స్ ఏంటి మానస్.. కావ్య ఫీల్ అవ్వదా అని కామెంట్ చేసారు. మీరే అన్నారు కదా మానస్ అని, మానస్ కాబట్టి చేశాను.. అదే రాజ్ అయితే చెయ్యడు కదా అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు మానస్. ఇలా వీరిద్దరు కలిసి చేసిన ఈ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.