English | Telugu

నాకు కాబోయే భార్యని మీరు కంట్రోల్ చేయాలని చూడకండి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -766 లో.. వసుధార, రిషి ఇద్దరూ కలిసి అలా బయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే రిషికి శైలేంద్ర కాల్ చేసి.. ఎక్కడ ఉన్నారు? వస్తున్నారా అని అడుగుతాడు. కాసేపు ఆగి వస్తామని రిషి అంటాడు. శైలేంద్ర అలా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడంతో జగతి వాళ్లకు ఏమైనా హాని చేస్తాడేమోనని బయపడుతుంది..

ఆ తర్వాత శైలేంద్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతు పని అయిపోవాలని చెప్తాడు. అది విన్న జగతి.. రిషి వాళ్ళకి శైలేంద్ర ఏమైనా ఇబ్బంది కలిగిస్తాడేమోనని భావించిన జగతి.. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది.. నా బిజినెస్ గురించి మాట్లాడుతున్నానని శైలేంద్ర అంటాడు.. ఏంటి నీ కొడుకు ఇంటికి రాకుంటే కూడా నా కొడుకుని అనుమానిస్తూన్నవా అని అక్కడే ఉన్న దేవయాని అంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి రిషి, వసుధార ఇద్దరు వస్తారు.

రిషి, వసుధారలను చూసిన జగతి‌.. ఏంటి వసుధార.. ఏం చేస్తున్నారు. ఇంత రాత్రి అయింది త్వరగా ఇంటికి రావాలని తెలియదా? మీకు ఎంగేజ్ మెంట్ మాత్రమే అయింది‌. ఇంత రాత్రి వరకు ఉంటే ఎలా అని జగతి కోప్పడుతుంది.. మేడం నేను వసుధారని తీసుకెళ్ళాను.. మీరు తనని ఒక్క మాట అనడానికి వీలు లేదు.. తనకి నచ్చినట్టు తనని ఉండనివ్వండి.. కంట్రోల్ చెయ్యాలని చూడకండి.. అయిన వసుధార నాకు కాబోయే భార్య.. తనని ఎక్కడికైనా తీసుకెళ్లే హక్కు నాకుంది.. మీరు మా విషయం ఎక్కువగా పట్టించుకోకండని జగతితో రిషి అంటాడు.

జగతి, వసుధారని పక్కకి తీసుకెళ్ళి.. రిషికి శైలేంద్ర ఏ హాని తలపెడతాడో అని భయంగా ఉందని జగతి అంటుంది.మేడం రిషి సర్ మిమ్మల్ని అలా అన్నందుకు బాధ లేదా అని వసుధార అంటుంది.. రిషి నన్ను ఏం అన్నా నాకు పర్లేదు కానీ ఆ శైలేంద్ర రిషిని ఏం చేస్తాడో అని భయంగా ఉందని జగతి అంటుంది.

మరొకవైపు శైలేంద్ర, దేవయాని ఇద్దరు మాట్లాడుకుంటూడగా ధరణి వింటుంది. వీళ్ళు ఇంత రాక్షసంగా ఆలోచిస్తున్నారా? ఈ విషయం రిషికి చెప్పాలని ధరణి వెళ్తుంది. ధరణి వెళ్ళడం గమనించిన శైలేంద్ర.. తన వెనకాలే వచ్చి రిషితో ధరణి నిజం చెప్పకుండా.. టాపిక్ ని డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత వసుధార ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది‌. అప్పుడే వసుధార దగ్గరికి రిషి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.