English | Telugu

వంటలక్క ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

బుల్లితెరపై టీవీ సీరియల్స్ హవా ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఇంట్లో ఆడవాళ్ళు ఇష్టంగా చూసే ఈ సీరియల్స్ లో అత్తాకోడళ్ళ డ్రామా ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. అలాంటి వాటిల్లో కంటెంట్ కొంచెం బాగుంటే చాలు ఆ సీరియల్ సూపర్ హిట్ అవుతుంది. అలాంటిదే కార్తీకదీపం సీరియల్. ఈ సీరియల్ కోసం ప్రేక్షకులు పనులు మానుకొని మరీ ఎదురు చూసేవారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు టెలివిజన్ రంగంలో ఈ సీరియల్ సంచలనం సృష్టించింది. కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల, దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ అంత బాగుంటుంది. దీపని ప్రతీ ఇంట్లో ఆడపడుచుల భావించారు. ఈ సీరియల్ ముందు నుంచే నిరుపమ్ పలు సీరియల్స్ లో నటించినా.. కార్తీక దీపంతోనే ఎక్కువ ఫేమ్ లభించిందని చెప్పాలి.

ప్రేమి విశ్వనాథ్ గురించి చెప్పాలంటే.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం లేని కేరళ కుట్టి. కేరళ లో పుట్టిన ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపంతో తెలుగు బుల్లితెరకి పరిచయం అయింది. ఈ ఒక్క సీరియల్ తో స్టార్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఈ సీరియల్ లో కార్తీక్ ని డాక్టర్ బాబు అని పిలుస్తుంది దీప. దీపని వంటలక్క అని అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు.

మంచి కథతో ప్రతీ కుటుంబానికి దగ్గర అయిన కార్తీక దీపం.. మూడు నెలల క్రితం సరైన ముగింపు లేకుండా మళ్ళీ కలుద్దామంటూ ఎండ్ టైటిల్ వేశారు. కాగా దీప కార్తీక్ లు ఒక్కటవ్వడం బానే ఉంది కానీ సీరియల్ లో లేడీ విలన్ అయిన శోభాశెట్టి అలియాస్ మోనిత గురించి ప్రస్తావన రాలేదు. కార్తీక్ కి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న మోనిత మాత్రం కార్తీక్ ప్రేమ కోసం తపించిపోయింది. కార్తీక్, దీప ల మధ్య గొడవలు పెడుతుంటుంది మోనిత. కొన్ని రోజులు కార్తిక్, దీపలు దూరంగా ఉండి.. చివరికి ఒక్కటవుతారు కాని మోనిత మాత్రం తన తప్పు తెలుసుకొని మారదు. అయితే ఈ సీరియల్ మళ్ళీ కలుద్దామని ముగించేసారు మేకర్స్.. సరైన క్లైమాక్స్ లేకుండా మళ్ళీ కలుద్దాం అనేసరికి కార్తీక దీపం-2 ఉంటుందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. తీరా చూస్తే దానికి సంబంధించిన పనులు మొదలవనట్లే తెలుస్తుంది.

సీరియల్ హీరో నీరుపమ్ పరిటాల.. తాజాగా కొత్త సీరియల్ రాధకు నీవేరా ప్రాణం లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ తన ఓన్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాగా తాజాగా నాగచైతన్య నటించిన కస్టడి మూవీలో ప్రేమి విశ్వనాథ్ నటించింది. దీంతో 'కస్టడీ' సినిమాని చూసిన 'కార్తీకదీపం' సీరియల్ ఫ్యాన్స్ దీపని స్క్రీన్ మీద చూసి విజిల్స్, కేకలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ క్రేజ్ అలాంటిది మరి. అయితే ఆమె నటించిన కస్టడీ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు వంటలక్క వెండితెరపై తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటుందా లేక తనకి బాగా కలిసొచ్చిన బుల్లితెరపైనే కొనసాగుతుందో చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.