English | Telugu

మా అమ్మ ఎప్పుడూ ఆ సీరియల్స్ చూస్తూనే ఉంటుంది!

జీ తెలుగు మహోత్సవం 2023 ఈవెంట్ ప్రోమోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ షోకి సంబంధించి ఒక లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ మహోత్సవానికి బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ నుంచి ఎంతో మంది నటీనటులు వచ్చారు. ఇక "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీతో ఒక సెన్సేషన్ సృష్టించిన నవీన్ పోలిశెట్టి వచ్చి మస్త్ డాన్స్ చేసాడు. "అమ్మా నాకు ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే చక్కగా కూర్చుని జీ తెలుగు సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటుంది. అమ్మా కాలికి దెబ్బ తగిలింది అని చెప్తే ఏ ఆగు అక్కడ సీరియల్ అతనికి యాక్సిడెంట్ అయ్యింది " అని బాధపడుతూ ఉంటుంది అని వాళ్ళ అమ్మ జీ తెలుగు సీరియల్స్ ని ఎంత కాన్సంట్రేషన్ తో చెప్తుందో చెప్పాడు నవీన్. తరువాత "కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అన్నాను..కానీ కొంచెమే కదా అని మీరు టచ్ లో లేరు" అని ప్రదీప్ అనడంతో "నువ్వు నీ షోలో ఎప్పుడూ పిలవలేదుగా నన్ను...ఒక నాలుగు హిట్ లు పడితే అప్పుడు చూద్దాం అని చెప్పి ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చేసావా" అన్నాడు ఫన్నీగా నవీన్ .

"మా కొత్త సినిమా మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి..ఇది విన్నాక మన ఇంటి పేరు నాశనం చేస్తున్నాడన్న ఫీలింగ్ లో ఉన్నారు ఇంట్లో వాళ్ళు. ఫైనల్ గా పోస్టర్ మీద ఇంటి పేరు చూసేసరికి ఇంట్లో వాళ్లంతా రివర్స్ ఇపోయారు. ఈ సినిమా కథ విన్నాక చాలా ఎక్సయిట్ అయ్యాను. హీరోయిన్ ఎవరు అనేసరికి అనుష్క అన్నారు. విన్నవెంటనే నేను ఒక టు మినిట్స్ రూమ్ లోకి వెళ్లి డాన్స్ వేసుకున్నా. అదిరిపోయింది" అన్నాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ జాతిరత్నాలు మూవీతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. వెరైటీ కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటూ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.