English | Telugu

నిన్ను పెళ్లిచేసుకుంటా అన్న ఫ్యాన్ కి ఇలా ఆన్సర్ చేసిన రీతూ

రీతూ చౌదరి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది టీమ్ లో ఉంటూ తన మీద పంచులు వేయించుకునే ఒక లేడీ కమెడియన్ గా బాగా పేరు తెచ్చుకుంది. ఐతే రీతూ ఈ మధ్య ఈ రెండు షోస్ లో అంతగా కనిపించడం లేదు. కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో మాత్రం లేటెస్ట్ అప్ డేట్స్ తో రెగ్యులర్ గా ఫాన్స్ తో టచ్ లో ఉంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సులో ఫోటో షూట్స్ తో వాళ్ళను ఎంటర్టైన్ చేస్తోంది. అలాంటి రీతూ ఇప్పుడు "ఏంటి సంగతులు" అంటోంది.

ఇంకేముంది ఫాన్స్ అంతా నచ్చిన ప్రశ్నలు అడగడానికి రెడీ ఇపోయారు. "హైపర్ ఆదితో మీ కాంబినేషన్ ని మిస్ అవుతున్నాం" అనేసరికి "అవును నేను కూడా మిస్ అవుతున్నా" అంది. "రీతూ బాగున్నావ్..చాలా అందంగా ఉంటావ్..నువ్వు చాలా మంచిదానివి" అనడంతో థాంక్స్ అని చెప్పింది. "నిన్ను పెళ్లి చేసుకుంటాను రీతూ..మీ నాన్న లాగా చూసుకుంటాను ..లవ్ యు రీతూ" అని అడిగేసరికి "ఆ ...థాంక్స్ ఫర్ యువర్ లవ్" అని రిప్లై ఇచ్చింది. "నిన్ను కలవడం కోసం వెయిటింగ్" అనడంతో "ఇక్కడ నేను కూడా వెయిటింగ్" అని చెప్పింది.

"రీసెంట్ గా భాగ్యనగర ప్రయాణంలో" అనే ఒక తెలుగు షార్ట్ ఫిలింలో కూడా నటించింది. రీసెంట్ గా తన తండ్రిని కోల్పోయింది. చాలా రోజులు ఆ ఎమోషన్ లో ఉండిపోయింది. తర్వాత కొంచెం తేరుకుని మళ్ళీ ఫోటో షూట్స్ అవీ స్టార్ట్ చేసింది..టిక్ టాక్ వీడియోస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రీతూ "అమ్మ కోసం, ఇంటి గుట్టు" వంటి పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.