English | Telugu

పులి వస్తుందా, రాదా అనే భయంలో షూట్ చేసిన సీన్ అది

సుమ అడ్డా షోలో ఏ వారం టాలీవుడ్ హల్క్ గా పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి అలాగే పరేషాన్ మూవీ టీమ్ నుంచి తిరువీర్, పావని, రూపక్ వచ్చి సందడి చేశారు. ఐతే ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా "సమోసా తిన్నావా శిరీష" అని "సమోసా సీన్ టైంలో ఏదో ఇన్సిడెంట్ జరిగిందట..ఏంటది" అని అడిగింది సుమ. "అది ఫారెస్ట్ ఏరియా. నేను పావని కూర్చుని డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంతలో పై నుంచి ఒకతను వెళ్తూ వెళ్తూ బండి ఆపేసి ఏమిటి ఇక్కడున్నారు..ఇక్కడ నిన్న పులి తిరిగింది అన్నాడు. అంతే మాకు చాలా భయమేసింది.

అప్పుడు మా వెనకాల చెట్లు కదిలినా, పేపర్ సౌండ్ వచ్చిన, బాటిల్ సౌండ్ వచ్చిన, మనిషి సౌండ్ వచ్చినా..వెనక్కి చూసి లేదు, పులి కాదు అనుకుంటూ పులి వస్తుందా, రాదా అనే భయంలో షూట్ చేసిన సీన్ అది." అని చెప్పాడు తిరువీర్ . "అలాగే మందు కూడా రియల్ గా తాగితేనే ఎక్స్ప్రెషన్ రాలేదట.." అని సుమ ఇంకోటి అడిగేసరికి "మందంటే రియల్ గా ఒరిజినల్ గా లోపల నుంచి తీసుకొచ్చి కొంచెం మూతలో పోసి నాలుక మీద పోశారు..నా నాలుక మొత్తం మండిపోయింది" అని తిరువీర్ చెప్పేసరికి "మీకు అర్ధమవుతోందా అంత మండేదాన్నే ఎందుకు అందరూ తాగుతారు" అని సుమ రివర్స్ లో అడిగింది. "గుండె మంట చల్లారుతుంది కాబోలు" అని చెప్పాడు. "గుండె మంట చల్లారితే పర్లేదు ఏకంగా గుండె చల్లారిపోతుందేమో ఏదో ఒక రోజు అని నా డౌట్" అంది సుమ. "సంక్రాంతి అంటే మీకేం గుర్తొస్తుంది" అంటూ తిరువీర్ ని పావనిని అడిగేసరికి "మూడు రోజులు ధూందాంగా చుట్టాల ఇంట్లో జరుపుకోవాల్సిందే. రొట్టెలు, భక్ష్యాలు, కోడి కూర ఇవి తప్పనిసరి. ప్రతీ సంవత్సరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం" అని చెప్పారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.