English | Telugu

స్పెషల్ గా తయారు చేయించిన బ్లూ టిక్ కేక్ తో ఫైమా

పటాస్ షో ద్వారా ఫైమా ఫేట్ మొత్తం మారిపోయింది. పటాస్ ఫైమాగా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడున్న అందరికీ గట్టి పోటీ ఇచ్చింది. అంతే కాదు బిగ్ బాస్ ద్వారా మంచి రెమ్యూనరేషన్ ని సొంతం చేసుకోవడమే కాదు తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక బుల్లితెర మీద షోస్ తో దూసుకుపోతోంది. తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది. జబర్దస్త్ కి, శ్రీదేవి డ్రామా కంపెనీ దూరమైపోయింది. స్టార్ మా ఛానెల్ లో "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోలో శ్రీముఖి సిస్టర్ గా సెటిల్ ఐపోయి ప్రతీ వారం ఆదివారం తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది. ఫైమా తన ఇన్స్టాగ్రామ్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటుంది. ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది.

ప్రశ్నలడిగితే సమాధానమిస్తుంది. పాటలు పాడమంటే కూడా పడేస్తుంది. అలాంటి ఫైమా కొన్ని రోజుల క్రితం తన కల గురించి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. నిద్ర పోయి లేచాక చూస్తే ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ పడిపోతే ఎంత బాగుంటుందో అనుకుంది. ఇలా అనుకుందో లేదో అలా నిజమైపోయింది. ఫైమా కూడా ఒక బ్లూ టిక్ కి ఓనర్ ఐపోయింది. ఆ ఆనందాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. బ్లూ టిక్ తో ఉన్న కేక్ ని తయారు చేయించుకుని అది పట్టుకుని ఫొటోస్ దిగి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేసింది. "ఫైనల్లీ బ్లూ టిక్..థాంక్యూ సో మచ్ ఎవరీ వన్ అని కామెంట్ చేసింది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ అంత ఫైమాని విష్ చేస్తున్నారు. "త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...ఇలాంటి బ్లూ టిక్ కేక్ కూడా ఉంటదా అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే ఉండదు..మనమే తయారు చేయించుకోవాలి." అని చెప్పింది. "ఇది నాకు ఒక హ్యాపీ మూమెంట్..నేను అనుకుని రాకుండా సడెన్ గా ఫోన్ చూసినప్పుడు రావాలి అనుకున్నా..అనుకున్నట్టే ఈరోజు అది జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అనే వీడియో తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.