English | Telugu

కార్తిక్ - క‌ర‌ణ్ క‌లిసిపోయిన‌ట్టేనా?

కార్తిక్ ఆర్య‌న్‌, క‌ర‌ణ్ జోహార్ ఇద్ద‌రూ క‌లిసిపోయిన‌ట్టేనా? వారిద్ద‌రి మ‌ధ్య అంతా స‌వ్యంగానే ఉందా? ఇప్పుడు బాలీవుడ్‌లో జ‌రుగుతున్న డిస్క‌ష‌న్ అంతా దీని గురించే. అందుకే వీరిద్ద‌రి పేర్లు హెడ్‌లైన్స్ లో మారుమోగుతున్నాయి. ముంబైలోని ఓ ఖ‌రీదైన భ‌వనం నుంచి కార్తిక్ ఆర్య‌న్‌, క‌ర‌ణ్ జోహార్ బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య అంతా ప‌ర్ఫెక్ట్ గా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. దోస్తానా 2 నుంచి కార్తిక్ ఎగ్జిట్ అయ్యాడ‌నే మాట‌ల‌కు ఇప్పుడు ఫుల్‌స్టాప్ ప‌డ్డ‌ట్ట‌యింది. దోస్తానా 2 ఆగిపోయింద‌ని,క‌ర‌ణ్ జోహార్‌తో చెడ‌టం వ‌ల్ల‌నే ఆ ప్రాజెక్ట్ నుంచి కార్తిక్ త‌ప్పుకున్నార‌ని చాలా వార్త‌లువ‌చ్చాయి. అయితే కార్తిక్‌గానీ, క‌ర‌ణ్‌గానీ దీని గురించి ఎప్పుడూ పెద‌వి విప్ప‌లేదు. అయితే, ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసింది దేనికోసం? దోస్తానా 2 చేస్తారా? లేకుంటే, దాన్ని ప‌క్క‌న పెట్టి సరికొత్త ప్రాజెక్టును టేక‌ప్ చేస్తారా? అనేది కూడా ఆలోచించాల్సిన విష‌యం. ``కార్తిక్‌, క‌ర‌ణ్ చాలా రోజుల త‌ర్వాత క‌లిశారు. గ‌తంలో ఏర్ప‌డ్డ మ‌న‌స్ప‌ర్థ‌ల నుంచి వారిద్ద‌రూ బ‌య‌ట‌ప‌డిన‌ట్టే. దాదాపుగా గంట సేపు మాట్లాడుకున్నారు.

ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు లేవుగానీ, వారిద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. క‌ర‌ణ్ ఆఫీస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన గంట సేపు త‌ర్వాత కూడా కార్తిక్ అక్క‌డే ఉన్నారు. మ‌రి అక్క‌డ అంత సేపు కార్తిక్ ఎవ‌రితోనైనా క‌థా చ‌ర్చ‌ల్లో ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి దీని గురించి మాట్లాడ‌టానికి ఇద్ద‌రూ సుముఖంగా లేరు`` అని అంటున్నాయి క‌ర‌ణ్ వ‌ర్గాలు. వారిద్ద‌రూ క‌లిసిపోయార‌నే మాట‌ను ఇండస్ట్రీ జ‌నాలు ఎలా రిజీవ్ చేసుకుంటున్నారోగానీ, ఫ్యాన్స్ మాత్రం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నారు. ``బిగ్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు చేయ‌బోతున్నారు? దోస్తానా 2 కావాలి`` అని ఒక నెటిజ‌న్ అంటే, ``క‌ర‌ణ్‌జోహార్ సార్ మా కార్తిక్ ఆర్య‌న్ ప‌క్క‌న సారా అలీఖాన్‌ని ఫిక్స్ చేయండి ప్లీజ్`` అంటున్నారు మ‌రో నెటిజ‌న్‌. 2019లో జోహార్ దోస్తానా2 గురించి అనౌన్స్ చేశారు. ఆ వెంట‌నే కోవిడ్ వ‌చ్చింది. సినిమా స్టార్ట్ కాక‌ముందే జోహార్‌కి, కార్తిక్‌కి మ‌ధ్య గొడ‌వ‌ల‌య్యాయంటూ చాలా వార్త‌లు వ‌చ్చాయి.