బి.విఠలాచార్య ఇచ్చిన సలహాతో నవరస నటనాసార్వభౌమగా ఎదిగిన కైకాల!
నవరసాలు పోషించగల సమర్థత ఉన్న నటులు చిత్ర పరిశ్రమలో కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. వారిలో ఎస్.వి.రంగారావు తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు కైకాల. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా