English | Telugu
శంబాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే
Updated : Dec 26, 2025
-కలెక్షన్స్ ఇవే
-హిట్ కొట్టాడా!
-ప్రేక్షకులు ఏమంటున్నారు
తెలుగు సినిమా పరిశ్రమకి దొరికిన మంచి నటుడు ఆది సాయి కుమార్(Aadi Saikumar). 2011 లో హీరోగా పరిచయమైన మొదటి చిత్రం 'ప్రేమ కావాలి' తో వంద రోజుల్ని కూడా జరుపుకొని రికార్డు సృష్టించాడు. కానీ ఆ తర్వాత చేసిన 'లవ్ లీ' అనే మూవీ తప్ప మిగతా చిత్రాలన్నీ ఆది తో పాటు అభిమానులని ప్రేక్షుకులని నిరాశపరిచాయి. సదరు చిత్రాలు ఆది కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నిన్న క్రిస్మస్ కానుకగా విడుదలైన 'శంబాల' మూవీతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడనే టాక్ బాక్స్ ఆఫీస్ వద్ద నడుస్తుంది. మెజారిటీ ప్రేక్షకులు సైతం శంబాల సూపర్ గా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
శంభాలా తొలి రోజు 1 .50 కోట్ల రూపాయల నెట్ ని రాబట్టినట్టుగా వినపడుతుది. ప్రస్థుతానికి మేకర్స్ అయితే కలెక్షన్స్ పై అధికార ప్రకటన ఇవ్వలేదు. టాక్ పాజిటీవ్ గా నడుస్తుంది కాబట్టి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.మరో ఐదు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఉండటంతో శంబాల కలెక్షన్స్ ఆసక్తికరంగా మారాయి.శాస్త్రాలు అబద్ధం, సైన్స్ మాత్రమే నిజమని నమ్మే నాస్తికుడైన యువ శాస్త్రవేత్త విక్రమ్ క్యారక్టర్ లో ఆది పెర్ ఫార్మ్ బాగుందని, కథ కూడా చాలా కొత్తగా ఉందని రివ్యూస్ చెప్తున్నాయి.
also read:shambhala review:శంబాల మూవీ రివ్యూ
కథ విషయానికి వస్తే శంబాల అనే మారుమూల గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరిలో అన్నీ అనర్ధాలు జరుగుతుంటాయి. దీంతో ఊరి ప్రజలు భయంతో వణికిపోతుంటారు. స్వామీజీల సహాయంతో బయటపడే మార్గాన్ని అన్వేషించే పనిలో పడతారు. ఈ మేరకు స్వామిజీ సూచనతో.. పాలకు బదులుగా రక్తాన్ని ఇస్తున్న ఆవుని చంపేయడానికి కూడా సిద్ధపడతారు. మరోవైపు ఊరిలో వరుస హత్యలు, ఆత్మహత్యలు సంభవిస్తూ ఉంటాయి.ఇలాంటి కథలో విక్రమ్ చూపించిన మార్గం ఏంటి అనే కథతో శంబాల తెరకెక్కింది.దేవిగా అర్చన అయ్యర్ క్యారక్టర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. యుగంధర్ ముని(yugandhar Muni)దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు.