జగన్ ఝలక్... ఏపీలో డిసెంబర్ 31వ తేదీ బార్లకు లాస్ట్ డేట్
మందు బాబులకు జగన్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. మరోవైపు బార్ల సంఖ్యకు భారీగా కోత విధించింది. డిసెంబర్ నెలాఖరు నాటికి 40 శాతం బార్ లు మూతపడే అవకాశముంది. దీనిపై లైసెన్స్ ఫీజులు కట్టే వ్యాపారాన్ని ప్రారంభించిన సిండికేట్ లు గగ్గోలు పెడుతున్నాయి. ఏపీలో నెల రోజుల వ్యవధి లోనే మద్యం ధరలను రెండవసారి భారీగా పెంచేసింది జగన్ సర్కార్...