English | Telugu

ఎన్టీఆర్ పిటిష‌న్ పై హైకోర్టు కీలక ఆదేశాలు!

వివిధ మాధ్య‌మాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించిన‌ ఢిల్లీ హైకోర్టు, ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ కీలక ఆదేశాల‌ను జారీ చేసింది.

ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్ లాంటి పేర్లు గానీ, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప‌రంగా వాడటం చ‌ట్ట విరుద్ద‌మ‌ని కోర్టు పేర్కొంది. ఎక్కడైనా ఇలా అనధికారంగా వాడినట్టు తెలిస్తే.. చట్టం ప్రకారం చర్యలు ఉంటాయనే ఆదేశాలను కోర్టు జారీ చేసింది.

ఎన్టీఆర్‌ ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అని స్ప‌ష్టం చేసిన కోర్టు.. ఎన్నో ఏళ్ల కెరీర్‌తో ఆయన ఈ మంచి పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఆయన పేరు, ఫోటో, రూపం అంటే వెంటనే ఎన్టీఆర్ గుర్తొస్తారని చెప్పింది. అందుకే ఆయన పేరు, ఇమేజ్ మీద హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. AI లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా ఫోటోలు మార్ఫ్ చేయడం వంటివి చేయకూడదని ఆదేశించింది.

అదేవిధంగా ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌ కి కూడా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను 2021 ఐటీ రూల్స్ కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, అభ్యంతరకర లింక్‌లను తీసేయాలని కోర్టు తెలియ‌జేసింది

మొత్తానికి ఎవరైనా ఎన్టీఆర్‌ పేరు లేదా ప్రతిష్ఠకు నష్టం క‌లిగించేలా ప్ర‌వ‌రిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొంది.

Also Read: అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్.. మరో 'మనం' అవుతుందా?

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం